Causes and prevention of UTI problems in young children
చిన్న పిల్లలు ఆరోగ్యం పరంగా చాలా సున్నితంగా ఉంటారు. అందుకే తొందరగా జబ్బుపడతారు. అలాంటి సమస్యలలో ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న సమస్య UTI యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది చిన్నవయస్సులో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. మూత్రనాళాలలో బాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ రావడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. పిల్లలు ఈ ఇన్ఫెక్షన్ వల్ల పిల్లలు మానసిక, శారీరక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, తల్లిదండ్రులు ఈ లక్షణాలను గుర్తించడంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
శుభ్రత లేకపోవడం:
టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. ముఖ్యంగా బాలికల్లో బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ట్‌లోకి ప్రవేశించవచ్చు.
టాయిలెట్ చేయకపోవడం:
పిల్లలు మూత్రం ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం, టాయిలెట్‌కి పోకపోవడం వంటి వాటివల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
డైపర్లు శుభ్రంగా లేకపోవడం:
చిన్నపిల్లల్లో డైపర్‌ను ఎక్కువసేపు మార్చకుండా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది.
వంశపారంపర్య యూరినరీ మార్గ సమస్యలు:
కొంతమంది పిల్లల్లో పుట్టుకతో ఉన్న మూత్రనాళాల్లో నిర్మాణ లోపాలు వల్ల కూడా UTI సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
బిగుతుగా ఉండే బట్టలు:
బిగుతుగా ఉండే అండర్వేర్‌లు లేదా నైలాన్ మేటీరియల్స్ వాడటం వల్ల కూడా వాపు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.