Chillies v/s chili.. Which is better for health to eat?
భారతీయ వంటకాల్లో మిరపకాయలు (Green Chilies), కారం (Red Chili Powder) కీలక పాత్ర వహిస్తాయి. ఈ రెండూ లేకుండా వంట చేయడం, తినడం రెండు కష్టమే. ఇవి వంటకు రుచిని, మసాలాను, కారాన్ని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. కానీ, ఈ రెండిటిలో విషయంలో చాలా మందిలో ఉన్న సందహం ఏంటంటే ఆరోగ్య పరంగా ఏది తినడం, వాడటం మంచిదీ అని. దీని గురించి ఇక్కడ వివరంగా వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు:
మిరపకాయల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని రోజు తినడం వల్ల తరుచుగా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మిరపకాయలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి పలు రకాల కేన్సర్ లాంటి వ్యాధుల నుండి రక్షణ అందిస్తాయి. మిరపకాయలో కలోరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. మిరపకాయలు శరీరంలో ఎండోఫిన్లు విడుదల చేస్తాయి. ఇది సాధారణంగా వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
మిరపకాయల వల్ల కలిగే నష్టాలు:
మిరపకాయల ఆరోగ్యానికి చాలా మంచివి కానీ, అధికంగా తింటే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాద ఉంది. కొంతమందిలో అలెర్జీ, పేగుల వాపు (IBS) వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
కారంలో కాప్సైసిన్ (Capsaicin) సమృద్ధిగా ఉంటుంది. ఇది వంటలో వాడటం వల్ల రుచిని అందించడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే కారం అనేది కొన్ని రకాల సూక్ష్మజీవులను అరికట్టడంలో సహాయపడుతుంది. వంటకానికి మంచి రుచిని, రంగు అందిస్తుంది.
కారం వల్ల నష్టాలు:
కారం రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది కానీ, అధికంగా తీసుకుంటే పేగులలో మంట, అల్జర్ల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని కారం పొడులలో మిశ్రమ రసాయనాలు, కల్తీ పదార్థాలు కలపడం జరుగుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగే ప్రమాదం ఉంది.
కాబట్టి, మిరపకాయలు ఆరోగ్య పరంగా మితంగా తీసుకుంటే కారం కంటే మెరుగైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇవి తాజా గానే వాడుతారు, కల్తీ అవకాశాలు తక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే గాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు మితంగా తీసుకోవాలి. అయితే, కారం పొడిని వాడే ముందు అది నాణ్యమైనదేనా, కల్తీ పదార్థాలు లేకుండా తయారు చేయబడిందా గమనించాలి. తక్కువ మోతాదులో కారం వాడితే ఆరోగ్యపరంగా పెద్దగా హానికరం కాకపోవచ్చు.