మలబద్దకం.. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. నేటి జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, తక్కువ శారీరక చర్యల కారణంగా చాలా మందిని ప్రభావితం అవుతున్నారు. ఇది పేగుల చలనం మందగించడం వల్ల మలము గట్టి కావడం, తరచుగా శౌచానికి పోవాలనే భావన లేకపోవడం, లేదా కడుపు పూర్తిగా ఖాళీ కాకపోవడం లాంటి లక్షణాలతో కనిపిస్తుంది. ఈ సమస్యకు మందులు ఉన్నప్పటికీ సహజంగా తగ్గించే చిట్కాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. కాబట్టి, అలాంటి చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.ఫైబర్ ఫుడ్, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవడం:
ఫైబర్ అనేది మలాన్ని మెత్తగా చేసి, పేగులలో గమనాన్ని వేగంగా జరిపే సహజ పదార్థం. అధిక ఫైబర్ ఉన్న ఆహారం మలబద్దకాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఆపిల్, పప్పాయ, పీరిక, ఓట్స్, బీన్స్, పప్పుదినుసులు, పాలకూర, ముల్లంగి వంటివి
2.తగినంత నీరు తాగడం:
నీటి లోపం మలబద్దకానికి ప్రధాన కారణం. మలం గట్టిపడకుండా ఉండేందుకు నీరు అవసరం. అధిక ఫైబర్ తీసుకుంటే మరింత నీరు అవసరం అవుతుంది. కాబట్టి, రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల వరకు నీరు తాగాలి.
3.ఉదయాన్నే నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీరు తాగండి:
ఈ మిశ్రమం జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది, పేగుల చలనాన్ని ప్రేరేపిస్తుంది. ఇది సహజ లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ రసం కలపండి, ఒక చెంచా తేనె కలిపి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు అందుతాయి.
4.శారీరక వ్యాయామం:
చలనం లేకపోవడం వలన కూడా మలబద్ధకం వస్తుంది. నిత్య జీవితంలో కొంత వ్యాయామాన్ని చేర్చడం వలన పేగుల కదలిక మెరుగవుతుంది. రోజూ 20 నుంచి 30 నిమిషాల నడక, యోగా ఆసనాలు: పవన ముక్తాసనం, భుజంగాసనం, వజ్రాసనం మొదలైనవి, స్క్వాట్స్, తేలికపాటి వ్యాయామాలు కూడా మంచివే.
5.ట్రిఫలా చూర్ణం:
ట్రిఫలా అనేది ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన ఓ ఔషధ మిశ్రమం. ఇది మలబద్దకాన్ని సహజంగా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులోని హరితకి, బిభీతకి, అమలకి అనే మూడు ఫలాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పడుకునే ముందు ఒక చెంచా ట్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి. ఇది మలాన్ని సాఫీగా చేయడంలో సహాయపడుతుంది.