Site icon 10TV Telugu

Thyroid Problem: మందులు వాడకుండానే థైరాయిడ్ నయం.. ఈ 5 రకాల ఫుడ్ తో అద్భుతమైన ఫలితాలు

Consuming these 5 types of food daily can cure thyroid

Consuming these 5 types of food daily can cure thyroid

థైరాయిడ్ సమస్యలు అనేది ఈ మధ్య కాలంలో మహిళలు, పురుషులల్లో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది ముఖ్యంగా శరీరంలోని హార్మోన్ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య వల్ల మనుషుల్లో అధిక లావు అవడం లేదా సన్నబడటం జరుగుతుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే ధైరాయిడ్ సమస్యను మందుల ద్వారా నయం చేయడం సాధ్యమే, అయినప్పటికీ కొన్ని సహజ ఆహార పదార్థాలను సరైన మోతాదులో క్రమంగా తీసుకోవడం తీసుకోవడం వల్ల మందులు లేకుండానే థైరాయిడ్‌ను నియంత్రించవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి? ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.మునగ ఆకులు:
మునగ ఆకులలో యాంటీ-ఇంఫలమేటరీ, యాంటీయాక్సిడెంట్ పోషకాల పుష్కలంగా ఉంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయి. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రెండింటిలోనూ ఇవి ఉపయోగపడతాయి. మునగ ఆకులను వంటలో, చట్నీలలో, పౌడర్ రూపంలో తయారుచేసుకొని తినవచ్చు. ప్రతిరోజూ ఒక చిన్న కప్పు మునగ ఆకుల జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

2.అల్లం:
మన రోజు వారి ఆహారంలో భాగమయ్యే అల్లంలో మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. అల్లం శరీరంలో ఉండే వాపును తగ్గించడంలో, హార్మోన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మరి, అల్లంని టీ రూపంలో తాగడం, వంటల్లో నిత్యం ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

3.కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో మిడిల్ చెయిన్ ఫ్యాటీ ఆసిడ్స్ (MCFAs) అధికంగా ఉంటుంది. ఇది మెటాబాలిజాన్ని వేగవంతం చేసి, థైరాయిడ్ ఫంక్షన్‌ను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ 1 లేదా 2 టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి నీటిలో కలిపి తాగవచ్చు. అలాగే వంటల్లో కూడా వాడుకోవచ్చు.

4.గుడ్లు:
గుడ్లలో సెలీనియం, ఐడిన్, విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. ముఖ్యంగా సెలీనియం థైరాయిడ్ గ్లాండ్‌కి రక్షణగా పనిచేస్తుంది. కాబట్టి, రోజు ఒక్కటి లేదా రెండు ఉడికిన గుడ్లు తినడం మంచిది. హై కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం గుడ్డులో పసురం (ఎగ్ యోల్క్) తగ్గించి తినాలి.

5.బెర్రీలు:
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌తో వచ్చే ఉబ్బసం, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. గులాబీ ద్రాక్ష హార్మోన్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది. కాబట్టి, నిత్యం 1 కప్పు తాజా బెర్రీలు, ఆమ్లా జ్యూస్ ను తాగడం మంచిది.

కొన్ని సూచనలు:

Exit mobile version