Cooking actually accounts for a lot of our emissions : ఉదయం లేచిన దగ్గర్నుంచి మళ్లీ నిద్రపోయేవరకు ఇంట్లో కిచెన్‌లో ఏదో ఒక వంట చేయందే పొద్దుపోదు.. రకరకాల రుచికరమైన ఆహారపు వంటకాలను వండివారుస్తుంటారు. ఆహారాన్ని ఊడికించే సమయంలో వెలువబడే వాయువుల ఉద్గారాలతో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. గ్యాస్ వంట ద్వారా కొన్ని ఉద్గారాలు ఇంట్లో పేరుకుపోతాయి. తద్వారా గణనీయమైన అనారోగ్య ప్రభావాలను కలిగిస్తాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధాన సవాళ్లుగా మారింది. ప్రపంచమంతా పర్యావరణ కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలతో గ్లోబల్ వార్మింగ్ సమస్య ప్రాణాంతకంగా మారింది.
అయితే ఇతర కర్బన ఉద్గారాల్లో కంటే.. వంటింట్లో ఆహారాన్ని ఊడికించినప్పుడు వెలువడే ఉద్గారాలే ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. వంట పద్ధుతుల్లో మార్పులతో ఈ సమస్యను అధిగమించవచ్చునని చెబుతున్నారు. ఆహారాన్ని వండే పద్ధుతులను మార్చడం ద్వారా ప్రపంచ పర్యావరణ సంక్షోభంలో గొప్ప మార్పులు సాధ్యమేనంటోంది యూకేలోని కొత్త అధ్యయనం. గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువుల ఉద్గారాలు 61శాతం ఇంట్లో కుకింగ్ నుంచి వెలువడుతున్నాయని పేర్కొంది. ఆహారాన్ని వివిధ వంట పద్ధతుల్లో చేయడం ద్వారా అనేక రకాల ఉద్గారాలు పెద్ద మొత్తంలో వెలువడుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
ప్రపంచ ఉద్గారాల్లో 37శాతం ఆహారపు వంటకాల్లోనే :
గృహ వంట పద్ధతులపై డేటా చాలా అరుదు అనే చెప్పాలి. ప్రపంచ ఉద్గారాలలో 37శాతం ఆహారపు వంటకాల నుంచే విడుదలవుతుందని అంచనా. ఏదేమైనా, మాంసం, కూరగాయల వంటకాల్లో మొత్తం ఉత్పత్తి అయ్యే ఉద్గారాలలో వరుసగా 20శాతం నుంచి 36శాతం వరకు ఉంటుందని అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే.. ఆహారం వండే సమయంలో వెలువడే వాయువులే ఉద్గారాలకు ప్రధాన కారణమంటున్నారు. యూకే యూనివర్శిటీల పరిశోధకులు గృహాలలో వంట అలవాట్లపై డేటాను సేకరించడానికి 765 మందిపై ఒక సర్వే నిర్వహించారు.
10 రకాల ఉపకరణాలతో కూడిన 11 వేర్వేరు వంట పద్ధతులను గమనించారు. ఆహారం వండే సమయంలో ఉద్గార ప్రభావాలు సగటున 6–61శాతం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ ఉద్గారాల స్థాయి ఆహారాన్ని వండే పద్ధతి బట్టి మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కూరగాయల (బంగాళాదుంపలు, క్యారెట్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఉల్లిపాయలు) ఊడికించడం ద్వారా మొత్తం విడుదలయ్యే ఉద్గారాలలో 61శాతం వరకు ఉంటుంది. మాంసం, చేపల వంటకాల్లో మొత్తం ఉద్గారాలలో 8శాతం నుంచి 27శాతం ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. మాంసంలో వెలువడే ఉద్గారాలు చాలా పెద్దవిగా ఉంటాయి.
రెడీ-టు-ఈట్ ఫుడ్స్ .. :
రెడీ-టు-ఈట్ ఫుడ్స్… 13శాతం రొట్టెలను కాల్చడం ద్వారా ఉద్గారాలు విడుదల అవుతాయి. టోఫు వంటి సెమీ వండిన లేదా ముందే వండిన ఆహారాల్లో GHGలలో 42శాతం వరకు ఉంటుంది. కాల్చిన బీన్స్ వంట, వేడిచేసిన తరువాత ఉద్గారాలలో 6శాతం ఉంటుంది. మాంసం వండినప్పుడు వెలువడే ఉద్గారాలలో 11శాతం మాత్రమే ఉంటుంది. వంట నుంచి ఉద్గారాలను తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయని అంటున్నాయి పలు అధ్యయనాలు.. వంట పద్ధతిని మార్చడం ద్వారా ఉద్గారాలను కనీసం సగం (టోస్ట్ విషయంలో) 16 రెట్లు (టోఫు విషయంలో) తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
మైక్రోవేవ్‌లు తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కూరగాయలను ఓవెన్‌లో వేయిస్తే.. ఉద్గారాల ప్రభావం53–78శాతం ఉంటుంది. మైక్రోవేవ్ ఉపయోగించడం వల్ల ఉద్గారాలను 78శాతం వరకు తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ గ్రిల్‌లో చికెన్ గ్రిల్లింగ్ ఓవెన్‌లో వంట చేయడం కంటే 73శాతం తక్కువ GHG ఉద్గారాలను విడుదల చేస్తుంది. వంట సమయాన్ని గణనీయంగా తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ తో ఉద్గారాలను మరింత తగ్గించవచ్చు. ఎందుకంటే 50శాతం తక్కువ శక్తి అవసరం పడుతుందని అధ్యయనం కనుగొంది. కుక్ ఫుడ్ కోసం మైక్రోవేవ్ ఉపయోగించడం, పొయ్యిలో వేయించడం వంటివి పర్యావరణ అనుకూలమైన వంట పద్ధతి ద్వారా GHG ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.