కోవిడ్ – 19 (కరోనా) భయం ఇంకా వీడడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు బయటపడడంతో..వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే..తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు, నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్ – 19 బారిన పడకుండా..చూసుకోవాలంటే.. ముఖాన్ని పదే పదే తాకొద్దని నిపుణులు చెబుతున్నారు. మాస్క్‌లు ధరించాలని అంటున్నారు. ముఖంపై T-ZONE పిలిచే ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలని వెల్లడిస్తున్నారు. ముఖంపై కళ్లు, ముక్కు, నోరు, ఈ మూడింటిని చూస్తే..ఆంగ్ల అక్షరం T ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని T-Zoneగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరసే కాకుండా..అనేక సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించడానికి ఈ టీ జోన్ ప్రధాన ద్వారంగా వెల్లడిస్తున్నారు. అందుకే దీనిని ముట్టుకోవద్దని అంటున్నట్లు వెల్లడించారు.
ముక్కును రద్దుకోవడం, కళ్లను పదే పదే నలుముకోవడం, చేతి వేళ్లతో పేదాలను తాకుతుండడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఇది కీలకమని చెబుతున్నారు. మొత్తంగా T-ZONE భద్రం అంటున్నారు. (మెట్రో రైలులో ఆన్ లైన్ టికెట్లు: కరోనా గురించి భయం వద్దు)
Read More : SBI ఖాతాలోకి YES BANK!