ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణకు కారణమైన చైనాలోని వుహాన్ సిటీ నుంచి వందలాది మంది విదేశీయులను స్వదేశాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే వైరస్ ఉద్భవించిన వుహాన్ సిటీ సహా హుబెయ్ ప్రావిన్స్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చైనాలోని విదేశీయులకు వైరస్ సోకకుండా ఉండేందుకు ముందుస్తు జాగ్రత్త చర్యగా అక్క్డడి నుంచి వారి స్వదేశాలకు తరలిస్తోంది. దీంతో చైనా నుంచి విదేశీయులు తమ స్వదేశాలకు క్యూ కట్టేస్తున్నారు. వుహాన్ సిటీ నుంచి రావడంతో ఆయా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
క్రిస్మస్ ద్వీపంలో విదేశీయుల నిర్బంధం :
ఈ వైరస్ లక్షణాలు అంత తొందరగా బయటకు కనిపించవు. వైరస్ సోకిందా? లేదా అనేది నిర్ధారించడానికి సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో స్వదేశీయులను తమ దేశంలోకి అనుమతిస్తే వైరస్ తీవ్రత ఎక్కువై మిగతా పౌరులందరికి కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. వుహాన్ సిటీ నుంచి వచ్చే పౌరులను ఎక్కడకి తరలించాలి అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ తమ పౌరుల కోసం ప్రత్యేకమైన ప్రదేశాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నాయి. వైరస్ తీవ్రత తగ్గి అంతా సర్దుమనిగే వరకు ప్రధాన భూభాగానికి దూరంగా ఎక్కడైనా దూరంగా విదేశీయులకు ఆశ్రయం కల్పించాలని యోచిస్తున్నాయి. అయితే, ముందుగా ఆస్ట్ర్రేలియా తమ స్వదేశీయుల కోసం క్రిస్మస్ ద్వీపాన్ని ఎంచుకుంది. ఇక్కడే విదేశీయులను రెండు వారాల పాటు నిర్భంధించనుంది.
ప్రధాన భూభాగానికి దూరంగా నిర్బంధం :
ఈ ద్వీపం ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 2వేల కిలోమీటర్లు (1,200 మైల్స్) దూరంలో ఉంది. వుహాన్ సిటీ నుంచి తిరిగి వచ్చే 600 మంది విదేశీయులను ఇక్కడి ద్వీపంలో నిర్బంధించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తోంది. ఆస్ట్రేలియా బాటలో ఇతర ప్రపంచ దేశాలైన జపాన్, అమెరికా, ఈయూలు కూడా తమ పౌరులను స్వదేశానికి రప్పించుకుంటున్నాయి. మరోవైపు.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ కరోనా వైరస్‌ను “డెవిల్” అని పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ను చైనా ఎలాగైనా నియంత్రిస్తుందని చెప్పారు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) నిపుణులు ఒకరు మాట్లాడుతూ.. వైరస్ ప్రభావం తగ్గడానికి గరిష్టంగా 10 రోజుల సమయం పట్టవచ్చు. చైనాలో వైరస్ మరణాల సంఖ్య 132కు పెరిగిందని NHC తెలిపింది.
ఎవరిని తరలిస్తున్నారు? :
క్రిస్‌మస్ ద్వీపంలో రెండు వారాల పాటు ఆస్ట్రేలియా పౌరుల తరలింపు జరుగుతుందని ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. ఈ ద్వీపం ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌గా ప్రసిద్ది చెందింది. ఈ పరిస్థితుల్లో పౌరులను నిర్భంద కేంద్రాలకు తరలించాలనే ప్రకటన.. మానవ హక్కుల ఉల్లంఘనంటూ వివాదానికి దారితీసింది. ప్రస్తుతం నలుగురితో కూడిన ఒక శ్రీలంక కుటుంబానికి మాత్రమే నివాసం ఉంది. ఈ సదుపాయం 1,000 మందికి పైగా ఉండేలా నిర్మించడం జరిగింది.
న్యూజిలాండ్ తమ 53 మంది పౌరులను ఆస్ట్రేలియా తరలింపుదారులతో కలిసి తీసుకురావడానికి కాన్ బెర్రాకు సహకరిస్తుంది. 200 మంది జపాన్ జాతీయులు వుహాన్ నుంచి తిరిగి వచ్చి టోక్యో హనేడా విమానాశ్రయంలో దిగారు. సుమారు 650 మంది ఇతరులు స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారని, జపాన్ ప్రభుత్వం కొత్త విమానాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. జపాన్ మీడియా ప్రకారం… తిరిగి వచ్చిన వారిలో చాలామంది జ్వరం లేదా దగ్గుతో బాధపడుతున్నారు. లక్షణాలు కనిపిస్తున్నాయా అనే దానితో సంబంధం లేకుండా అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు.
Also Read : పూర్తి Visual Guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!
సొంత ఇంటికి పంపే ముందు వారిని నిర్బంధ వార్డులో పరీక్షిస్తారు. వైరస్ తాలూకూ లక్షణాలపై రిపోర్టులు వచ్చేవరకు వారిని ఇళ్లను విడిచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. స్థానిక యుఎస్ కాన్సులేట్ నుంచి కార్మికులు, అలాగే కొంతమంది అమెరికా పౌరులు కూడా బుధవారం నగరం నుంచి బయలుదేరారు. రిపోర్టు ప్రకారం.. వుహాన్ నుంచి తరలివచ్చినవారు రెండు వారాల వరకు విమానాశ్రయ హ్యాంగర్‌లో ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని విడిచి దూరంగా వెళ్లాలనుకునే 200 మంది బ్రిటిష్ పౌరులను ఖాళీ చేయించడానికి UK విదేశాంగ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.
కానీ కొంతమంది యూకే పౌరులు స్వదేశానికి తిరిగి రావడానికి మద్దతు లేదని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. విడిగా, EU పౌరులను స్వదేశానికి పంపడానికి రెండు విమానాలు షెడ్యూల్ చేసింది. 250 మంది ఫ్రెంచ్ జాతీయులు మొదటి విమానంలో బయలుదేరారు. దక్షిణ కొరియా తన పౌరులలో 700 మంది ఈ వారంలో నాలుగు విమానాలలో బయలు దేరుతారని చెప్పారు. వారిని కూడా నిర్బంధిస్తారా? లేదా అనేది అస్పష్టంగా ఉంది. కానీ దక్షిణ కొరియా మీడియా మాత్రం.. వైరస్ సోకిన రోగుల అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని నివేదిస్తోంది. ఇప్పటివరకు, దేశంలో నాలుగు వైరస్ కేసులు నిర్ధారించారు.
Also Read : వైరస్ నుంచి ఫేస్ మాస్క్‌లతో రక్షించుకోగలమా?