చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో Coronavirus లక్షణాలుబయటపడ్డాయి. పలు దేశాల్లోని విమానయాన సంస్ధలు చైనాకు విమాన సర్వీసులను రద్దు చేశాయి.
ఇటు భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో చైనా, మయన్మార్ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చే ఆహరం, ఇతర ఉత్పత్తులు, దిగుమతులు అమ్మకాలపై నిషేధం విధించారు. మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల ప్యాక్ చేయని, లేబుల్స్ లేని ఆహార పదార్ధాలు…..ఇతర అన్ని ఉత్పత్తులపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు ఆరెండు రాష్ట్రాలు ప్రకటించాయి.
మణిపూర్ సరిహద్దుల వెంబడి ఉన్న మార్కెట్లలో చైనాకు చెందిన ఆహార పదార్థాలతో పాటు సెకెండ్ హ్యాండ్ వస్త్రాలు వంటి ఉత్పత్తులను కొనవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మియన్మార్ కు దారితీసే మణిపూర్ సరిహద్దు ప్రాంతమైన ఉఖ్రుల్ జిల్లాలోని రెండు గ్రామాల వెంబడి ఉన్నఅంతర్జాతీయ వాణిజ్య మార్గాన్ని ఫిబ్రవరి 9 నుంచి మూసివేయనున్నారు. మణిపూర్ కు, మిజోరంకు జనవరి మొదట్లో ఐదుగురేసి వ్యక్తులు చైనా నుంచి తిరిగి వచ్చారు. వారిని ఇళ్లకే పరిమితం చేసి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
నాలుగు భారతీయ రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అసోంలు 1880 కిలో మీటర్ల మేరకు బంగ్లాదేశ్ తో… మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లు మియన్మార్ తో 1640 కిలోమీటర్ల సరిహద్దులను కలిగి ఉన్నాయి. కాగా మియన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి భారత ప్రభుత్వం Coronavirus పరీక్షా కేంద్రాలను నెలకొల్పింది.