Daily Walk Best Health: ప్రతిరోజూ 11 నిమిషాలు వేగంగా నడిస్తే .. అకాల మరణాలను అడ్డుకోవచ్చా? పరిశోధనల్లో ఏం తేలిందంటే ..

ప్రతిరోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల అకాల మరణ ప్రమాదాన్ని 25శాతం తగ్గించవచ్చునని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజూ 11 నిమిషాలు లేదా వారంలో 75 నిమిషాలు వేగంగా నడిస్తే ...

Daily Walk Best Health: ఇటీవలి కాలంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఉన్నట్లుండి గుండెపోటు రావటం అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించడం వంటి ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ ఇలా అకస్మాతుగా వ్యక్తి కుప్పకూలి మరణించటం పలుసార్లు వైద్యులనుసైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో క్రికెట్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఒక్కసారే కుప్పకూలి మరణించాడు. మరోచోట క్యూలైన్ లో నిలబడిన వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలి మరణించాడు. ఇలా వరుస ఘటనలు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలాంటి మరణాలను తగ్గించాలంటే ప్రతీరోజూ 11 నిమిషాలు వేగంగా వాకింగ్ చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.

పావుగంట నడకతో ప్రాణాలు, పైసలు భద్రం : బద్ధకిస్తే రోగాలకు ‘టులెట్‌’ బోర్డు పెట్టినట్లే: సర్వేలో ఆసక్తికర విషయాలు

ప్రతిరోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల అకాల మరణ ప్రమాదాన్ని 25శాతం తగ్గించవచ్చునని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజూ 11 నిమిషాలు లేదా వారంలో 75 నిమిషాలు వేగంగా నడిస్తే చాలు. గుండెజబ్బు, పక్షవాతంతో పాటు పలు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోచ్చని తెలిపింది. యూకేకు చెందిన జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్) సూచన ప్రకారం.. శారీరక శ్రమలో కనీసం సగం చేసినా ప్రతి పది అకాల మరణాల్లో ఒకదాన్ని నివారించవచ్చునని బ్రిటిష్ జన్రల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.

Weight Loss : 30 నిమిషాల్లో 500 కేలరీలు బర్న్ చేయడానికి అద్భుత వ్యాయామాలు

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ప్రతిష్టాత్మక అధ్యయనం 30 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజల ఆరోగ్య డేటాను విశ్లేషించింది. ఈ పరిశోధనలో కొద్దిపాటి వ్యాయామంకూడా ఆయుష్సును గణనీయంగా పెంచేందుకు తోడ్పడుతుందని, గుండె జబ్బులు, అనేక రకాల క్యాన్సర్లను అరికట్టడం, చనిపోయే ప్రమాదాలను తగ్గించడం జరుగుతుందని పరిశోధనలో తేలింది. పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నుంచి తీవ్ర స్థాయి వరకు, 75నిమిషాలు అత్యంత తీవ్ర స్థాయి శారీరక శ్రమ చేయాలని అధ్యయనం పేర్కొంది. అంతేకాదు.. వారానికి 75 నిమిషాలు ఓ మోస్తరు శారీరక శ్రమ గుండె వ్యాధుల ముప్పును 17శాతం, క్యాన్సర్ల ముప్పును 7శాతం తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.

 

ట్రెండింగ్ వార్తలు