Dangerous health problems caused by high blood pressure
Blood Pressure: అధిక రక్తపోటు.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనివల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అందుకే దీనిని “నిశ్శబ్ద ఘాతుకుడు” అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఏ రకమైన లక్షణాలు లేకుండా శరీరాన్ని లోపల నుండి నిర్వీర్యం చేసి ప్రాణాపాయం కలిగించే పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాదు, అధిక రక్తపోటు(Blood Pressure) వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవాలు చాలా వరకు ప్రభావితమవుతాయి. మరి ఆ అంశాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.గుండె జబ్బులు:
అధిక రక్తపోటు ప్రధానంగా గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, గుండె విఫలం కావడం, ఎలార్జ్‌డ్ హార్ట్ వంటివి రావచ్చు. ఈ సమస్యల వల్ల గుండె తన పనిని సరిగ్గా చేయలేక, ప్రాణాపాయం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
2.మెదడు పై ప్రభావం:
రక్తపోటు ఎక్కువగా ఉండడం వల్ల మెదడులోని రక్తనాళాలు బిగుసుకొని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వాటిలో ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరాజిక్ స్ట్రోక్ ప్రధానమైనవి. ఇది మాట్లాడటం, నడవడం, స్మృతి వంటి పనులను ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణం కూడా సంభవించవచ్చు.
3.మూత్రపిండాల పనితీరు:
మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. కానీ, అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాల రక్తనాళాలను దెబ్బతినే ప్రమాదం ఉంది. దానివల్ల వాటి పనితీరును తగ్గుతుంది. అలా అవడం వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది.
4.చూపు సమస్యలు:
రక్తపోటు కంటిలోని సున్నితమైన నరాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల హైపర్‌టెన్సివ్ రెటినోపతి, విజన్ బ్లరింగ్/ చూపు కోల్పోవడం కలగవచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే శాశ్వత దృష్టి లోపానికి దారితీసే ప్రమాదం ఉంది.
5.ధమనుల్లో మార్పులు:
ఉన్నత రక్తపోటు ధమనుల్లో గట్టితనాన్ని/సన్నబడటాన్ని కలిగిస్తుంది. ఇది ఆథెరోస్క్లెరోసిస్, అన్యురిజం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అన్‌యురిజం పగిలితే అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. ఇది ప్రాణాంతకమవుతుంది.