Cool Drinks Side Effects: తల్లిదండ్రులు జాగ్రత్త.. పిల్లలకు కూల్ డ్రింక్స్ తాగించకండి.. ఎంత డేంజరో తెలుసా?
Cool Drinks Side Effects: రసాయనాల ద్వారా తయారుచేసినవి ఉన్నాయి. సహజంగా తయారుచేసిన వాటితో ఎలాంటి ప్రమాదం లేదు కానీ, రసాయనాలతో తయారుచేసిన చల్లని పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధనలు చెప్తున్నాయి.

Health problems in children caused by drinking cold drinks
కూల్ డ్రింక్స్ అనేవి రోజువారి జీవితంలో సాధారణంగా మారిపోయాయి. ఎండాకాలంలో శరీర చల్లదనం కోసం చాలా మంది వీటిని తాగుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎండాకాలంలోనే కాదు ఏ సమయంలో పడితే ఆ సమయంలో తాగుతున్నారు. అయితే, వాటిలో కూడా కొన్ని స్సహజమైన పానీయాలు ఉండగా.. కొన్ని మాత్రం రసాయనాల ద్వారా తయారుచేసినవి ఉన్నాయి. సహజంగా తయారుచేసిన వాటితో ఎలాంటి ప్రమాదం లేదు కానీ, రసాయనాలతో తయారుచేసిన చల్లని పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధనలు చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా వీటి ప్రభావం చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. మరి శీతల పానీయాల వల్ల చిన్న పిల్లల్లో కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలు:
- అధికంగా చక్కెర
- కార్బొనేషన్
- క్యాఫైన్
- ఆర్టిఫిషియల్ కలర్స్
- ఫ్లేవర్ రసాయనాలు
- ప్రిజర్వేటివ్‌లు
ఈ పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి:
1.అధిక చక్కెర వల్ల బరువు పెరగడం:
సాధారణంగా ఒక బాటిల్ కూల్ డ్రింక్‌లో కనీసం 7 నుంచి10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ఇది రోజువారీ అవసరానికి మించిన పరిమాణం. దీని వల్ల పిల్లల్లో బరువు పెరగడం ప్రారంభమవుతుంది. సుదీర్ఘంగా ఇది చిన్నపిల్లల్లో ఒబేసిటీకి దారితీస్తుంది.
2.పళ్ల సమస్యలు:
కూల్ డ్రింక్స్ లో ఉండే చక్కెర, యాసిడ్‌ల కలయిక వల్ల పిల్లల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. దాని వల్ల పళ్లు నల్లబడడం, దుర్వాసన, దంత నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
3.క్యాఫైన్ ప్రభావం:
కొన్ని కూల్ డ్రింక్స్ లో క్యాఫైన్ అధికంగా ఉంటుంది. అలనాటి పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో నిద్రలేమి, మానసిక ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు కలిగిస్తుంది.
4.టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం:
చిన్నవయసులో అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
5.ఎముకల బలహీనత:
కూల్ డ్రింక్స్‌లో ఫాస్ఫోరిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. పిల్లల ఎదుగుదలకు ఇది చాలా హానికరం.
తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు:
- తాజా జ్యూస్, పండ్ల రసాలు(బెల్లం నీరు, నిమ్మకాయ రసం, బాదం పాలు) తాగించే అలవాటు చేయాలి.
- కూల్ డ్రింక్ లో ఉండే రసాయనాల గురించి పిల్లలకు వాస్తవ చెప్పాలి.
- వార్షికంగా దంత పరీక్షలు, బరువు పరీక్షలు చేయించాలి.
కూల్ డ్రింక్స్ తాత్కాలిక సంతృప్తిని ఇస్తాయేమో కానీ, దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చిన్న వయస్సు పిల్లలు వీటిని తీసుకోవడం వల్ల జీవితాంతం ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి, పిల్లల భవిష్యత్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.