Site icon 10TV Telugu

Psoriasis : ఒత్తిడి వల్ల సోరియాసిస్ వస్తుందట.. హెచ్చరిస్తున్న నిపుణులు

Psoriasis

Psoriasis

Psoriasis : సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మం ఎరుపు లేదా తెలుపు రంగుకి మారడం.. మందంగా అవడం, వాపు, దురద వంటివి సంభవిస్తాయి. చర్మం పొలుసులుగా ఊడటం జరుగుతుంది. మోచేయి వెనుక భాగం, మోకాలు ముందు భాగం, తల, వీపు, ముఖం, చేతులు, పాదాలలో సంక్రమించే ఈ వ్యాధి ఒత్తిడి కారణంగా కూడా సోకుతుందట. హైదరాబాద్‌లో జరిగిన డెర్మాకాన్ 2024 సదస్సులో ఈ వ్యాధి.. చికిత్సకు సంబంధించిన అంశాలపై ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వైద్యులు మాట్లాడారు.

Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?
సొరియాసిస్ ఒక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. నేషనల్ సోరియాసిస్ ఫౌండేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2% నుండి 3% మిలియన్ల మందికి సోరియాసిస్ ఉందట. అయితే భారతదేశంలో, సుమారు 10 మిలియన్ల సోరియాసిస్ కేసులు ఏటా గుర్తిస్తున్నారు. దీనిపై హైదరాబాద్‌లో జరిగిన డెర్మాకాన్ 2024 సదస్సులో వైద్యులు మాట్లాడారు. పెరుగుతున్న ఒత్తిడి.. సోరియాసిస్ చికిత్సపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జీవనశైలిని మార్చుకోవడంతో పాటు సకాలంలో సరైన మందుల వాడాల్సిన ఆవశ్యకతను వైద్యులు ఈ సదస్సులో నొక్కి చెప్పారు. సోరియాసిస్‌ను విస్మరిస్తే సోరియాటిక్ ఆర్థరైటిస్ (PsA) కి దారి తీయవచ్చని కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎస్ కిరణ్ చెప్పారు.

Brittle Nails : మన గోళ్లు పెళుసుగా ఎందుకు మారతాయి ? సమస్యను ఎలా పరిష్కరించాలి.

సోరియాసిస్‌కు కాంతి చికిత్స, నోటి మందులతో పాటు బయోలాజికల్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ అసీమ్ శర్మ చెప్పారు. సోరియాసిస్ సోకిన వ్యక్తి దానిపై నిఘా పెట్టడం ఏదైనా మార్పులను గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం అని ఆయన అన్నారు. సోరియాసిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో బయోలాజిక్స్ పాత్రను నొక్కి చెప్పారు డాక్టర్ విజయ్ భాస్కర్ మల్లెల. ఈ వ్యాధి నుండి బయటపడాలంటే ముందుగా దాని లక్షణాలను గుర్తించడం ఎంతో కీలకమని చెప్పారు.  ఒత్తడిని తగ్గించుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు సరైన నిద్ర సోరియాసిస్‌ను తగ్గించడంలో సహాయపడతాయట. లక్షణాలు కనిపించగానే వైద్యుడిని సంప్రదిస్తే ప్రభావ వంతమైన ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డెర్మాకాన్ 2024 సదస్సులో ప్రముఖ రుమాటాలజిస్టులు, చర్మవ్యాధి నిపుణులు వెల్లడించారు.

Exit mobile version