శృంగారంతో రోగనిరోధక వ్యవస్థ నిజంగా పెరుగుతుందా? సైన్స్, నిపుణులు ఏం చెబుతున్నారు?

  • Publish Date - April 25, 2020 / 10:45 AM IST

కరోనా దెబ్బకు అంతా లాక్ డౌన్.. అందరూ ఇళ్లకే పరిమతమయ్యారు. అందులోనూ సామాజిక దూరం పాటించాల్సిన సమయం. బయటకు వెళ్తే కరోనా భయం.. చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఏదో ఒక పనిచేస్తూ సరదాగా గడిపేస్తున్నారు. కావాల్సినంత ఫ్రీ టైమ్ దొరికినట్టే కదా.. అందుకే లాక్ డౌన్ సమయం శృంగార పురుషులకు సరైన సమయంగా చెప్పవచ్చు. 24/7 టాప్ గేర్‌లోనే ఉండొచ్చు. ఇంట్లోనే పార్టనర్‌తో శృంగారంలో పాల్గొంటూ తెగ ఎంజాయ్ చేయొచ్చు. కరోనా కాలంలో మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండాలంటే.. ప్రతిఒక్కరిలోనూ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే కరోనా వంటి వైరస్ ప్రభావం నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ముందులేని కరోనాను నివారించాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదంటున్నారు నిపుణులు… ఇంతకీ  రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి.

కరోనా ఒత్తిడికి శృంగారమే మందు :
అన్నింటిలో శృంగారం ఒకటే సమర్థవంతంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు. ఇందులో నిజమెంతా? అనేదానిపై అధ్యయనాలు కూడా కొనసాగుతున్నాయి. మిగతావారితో పోలిస్తే శృంగార పురుషుల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని సెక్సాలిజిస్టులు అంటున్నారు. శృంగారంతో ఒత్తిడిని జయించవచ్చునని ఇదివరకే విన్నాం.. ఇమ్యూనిటీని కూడా పెంచే సామర్థ్యం శృంగారానికి ఉందని చెబుతున్నారు. పిచ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరిపిస్ట్  Janet Brito తన దగ్గరకు వచ్చే షేషంట్లకు ఇదే విషయాన్ని సూచిస్తున్నారంట. ప్రత్యేకించి కొవిడ్-19 భయంతో ఒత్తిడికి లోనయ్యేవారికి శృంగారమే సరైన మందుగా సూచిస్తున్నట్టు తెలిపారు. ‘తమ పార్టనర్లతో కలిసి జీవించే నా క్లయింట్లను ప్రశాంతమైన శృంగారంలో రెచ్చిపోయేలా ప్రోత్సహిస్తున్నాను’ అని చెప్పారు.

ప్రశాంతమైన శృంగారం.. మనస్సుకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే శృంగారం ఒక్కటే సరైనది అనేందుకు ఎన్నో కారణాలు చెప్పగలను అని బ్రిటో అన్నారు. కరోనా భయాన్ని తొలగించుకోవాలంటే మైండ్ ఫుల్ సెక్స్ ఒక్కటే సరైన మందుగా అభివర్ణించారు. మ్యూజిక్ వింటే ఎంతో హాయిగా అనిపిస్తుందో.. శృంగారం కూడా కరోనా ఒత్తిడికి గొప్ప పరిష్కారమని బ్రిటో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. లాక్ డౌన్ సమయంలో శృంగారం.. ఎలా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది? అది మీ మనస్సును ఎలా ఉత్తేజపరుస్తుందో బ్రిటో వివరించారు.

సురక్షితమైన శృంగారంతో మానసిక ప్రశాంతత :
శృంగారం అనంతరం ప్రతిఒక్కరిలోనూ మైండ్ రిలాక్స్ అవుతుంది. సెక్స్ హార్మోన్లలో endorphins, ఇతర మంచి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి.. ఒత్తిడిని కలిగించే cortisol, adrenaline వంటి (Stress hormones)హార్మోన్లల స్థాయిని తగ్గిస్తాయి. దీనికి సంబంధించి అధ్యయనం  The Journal of Health and Social Behavior‌లో పబ్లీష్ అయింది. endorphins హార్మోన్లు ఉత్పత్తి కావడంతో న్యూరో కెమికల్స్ ఉత్తేజం చెంది శరీరంలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మరో మంచి హార్మోన్..ఆక్సీటోసిన్ (Oxytocin) దీన్నే ‘Love’ హర్మోన్ అని కూడా అంటారు. శృంగారం సమయంలో ఈ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. కౌగిలంతలు, పోర్ ప్లే ద్వారా కూడా లవ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా క్షీరదాల్లో సామాజిక బంధాలు బలంగా ఉండటానికి కారణం శృంగారమేనని సైంటిస్టులు చెబుతున్నారు.

వారంలో ఒకసారి లేదా రెండుసార్లు శృంగారం : 
శృంగారం.. వారంలో ఎన్నిసార్లు చేస్తే మంచిది అనేదానిపై Pennsylvaniaలోని Wilkes University అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి వారంలో కొన్నిసార్లు శృంగారంలో పాల్గొనడం మధ్య సంబంధం ఉందని అంటోంది. వారంలో ఒకసారి లేదా రెండుసార్లు శృంగారంలో పాల్గొన్న కొంతమంది విద్యార్థుల్లో Immunoglobulin A (IgA) ఇమ్యునోగ్లోబులిన్ స్థాయిలు అత్యధిక స్థాయిలో పెరిగినట్టు రీసెర్చర్లు గుర్తించారు. ఇవి అనారోగ్యంతో పోరాడే యాంటీబాడీస్.. ఊపిరితిత్తుల్లోని శ్లేష్మ పొరలు, Sinuses, కడుపు, ప్రేగులలో ఉన్నట్టు గుర్తించారు. ఈ పొరలు ఉత్పత్తి చేసే ద్రవాలలో లాలాజలం, కన్నీళ్లు, రక్తంలో కూడా కనిపిస్తాయని రుజువైంది.

వారానికి ఒకటి లేదా రెండుసార్లు సెక్స్ చేసిన వ్యక్తులు అత్యధిక స్థాయిలో IgA కలిగి ఉంటారు. ఇది వారిని జలుబు నుంచి త్వరగా బయటపడటానికి సాయపడుతుంది. తక్కువ తరచుగా లైంగిక సంబంధం కలిగి ఉన్న రెండు గ్రూపుల కంటే.. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ లైంగిక సంబంధం కలిగి ఉన్న గ్రూపు కంటే ఈ గ్రూపులో 30శాతం ఎక్కువ IgA ఉంది. స్పష్టంగా చెప్పాలంటే.. (అన్ని సమయాలలో శృంగారం చేయడం వల్ల లోపాలు కనిపించాయి)

“ఇమ్యునోగ్లోబులిన్ ప్రాథమికంగా వైరస్‌లతో పోరాడుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని లాస్ ఏంజిల్స్‌లోని సైకాలిజిస్ట్, సెక్స్ థెరపిస్ట్  Shannon Chavez అన్నారు. ‘ప్లస్, మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు, రక్త ప్రసరణకు సాధారణ లైంగిక చర్య ఎంతో మంచిదన్నారు. ఈ ప్రక్రియలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. టాక్సిన్స్ (Toxins) విష వ్యర్థాలను విడుదల చేస్తాయి. శరీరంలో ఉద్ర్రేక స్థాయిని పెంచుతాయి’ అని Chavez చెప్పారు.

కౌగిలింత, ముద్దుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో : 
మానసికంగానూ, శారీరక ఆరోగ్యమైనా ఏదైనా సరే.. కౌగిలింత, ముద్దులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఓ మంచి కౌగిలింత మనస్సును ఉత్తేజపరుస్తుంది. Kinsey Institute నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దంపతుల్లో ఈ రెండు విషయాలు వారి దాంపత్యజీవితానికి శృంగార పాన్పును వేస్తాయని అంటున్నారు నిపుణులు. శృంగారంలో పాల్గొనే వారిలో సగానికి పైగా కేవలం కౌగిలింత లేదా రాత్రంతా ఇరువురు అదే భంగిమలో ఉండి శృంగారం చేస్తే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చునని అధ్యయనంలో గుర్తించారు.

ముద్దులు పెట్టుకోవడం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గించే సామర్థ్యం ముద్దులకు ఉందని అంటున్నారు. ముద్దు ద్వారా బ్లడ్ లిపిడ్స్ మెరుగుపడతాయని, అంతేకాదు.. ఒత్తిడి, అంతర్గత ఆందోళన వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చునని  Kinsey Institute, Indiana Universityలోని రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ Amanda Gesselman వెల్లడించారు.

30 నిమిషాల పాటు ముద్దులు పెట్టుకుంటే అలర్జీలను కూడా తగ్గిపోయినట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ముద్దు పెట్టుకోవడం ద్వారా మానసికంగా కొన్ని మార్పులను ఉత్పప్తి చేస్తుంది. దీని ద్వారా వ్యాధినిరోధక వ్యవస్థలోని ఉద్వేగాన్ని కలిగించే స్పందనలను తగ్గిస్తుంది.

మీరు సింగిలా? హస్తప్రయోగంతో ఆరోగ్యం  : 
శృంగారం ఒకటే కాదు.. మీలోని ఒత్తిడికి యాంటీ డోట్.. హస్తప్రయోగం కూడా ఒకటి. దీంతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. మీరు సింగిల్ అయితే.. హస్తప్రయోగం ద్వారా శృంగార కోరికలను మరింత సమయం ఆశ్వాధించొచ్చు. సెక్సువల్ కంటెంట్, న్యూడ్ వంటి వాటిని ఊహించుకోవడం ద్వారా మీకు మీరే సెక్స్ కోరికలను పెంచుకోవచ్చునని నిపుణులు బ్రిటో తెలిపారు.

ప్రస్తుతం.. ఒకవేళ మీరు మీ భాగస్వామికి దూరంగా క్వారంటైన్ లో ఉంటే.. ఒంటరితనంగా ఎంతో నిరుత్సాహంగా ఉంటారని బ్రిటో చెప్పుకొచ్చారు. కరోనా భయంతో మీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భాగస్వామితో శృంగారం చేయలేక మరింత ఒత్తిడికి లోనవుతుంటారని చెప్పారు. ఒత్తిడి సమయాల్లోనూ ఉత్సాహంగా ఉండాలంటే హస్త ప్రయోగం ఒక్కటే సరైన మార్గమని బ్రిటో సూచించారు.