Perfume Disadvantages: అధికంగా పెర్ఫ్యూమ్ వాడుతున్నారా.. సంతానలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్తలు పాటించండి

Perfume Disadvantages: రసాయనాలు ఇవి పరిమళాలను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అయితే, ఈ రసాయనాలు శరీరంలో హార్మోన్ల వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.

Does using perfume cause infertility?

మనలో చాలా మంది పెర్ఫ్యూమ్, డియోడ్రెండ్స్ వాడుతున్నారు. ఒంటినుండి చమట వాసన రాకుండా ఉండేందుకు ఇలాంటి పెర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. అయితే, సువాసన వరకు ఓకే గానీ, వీటిని అధికంగా వాడటం వల్ల మనిషి ఆరోగ్యానికి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఉందట. అందులో ప్రధానంగా సంతానలేమి సమస్య(infertility) వచ్చే అవకాశం ఉందట. ఇది చాలా మందిలో ఉన్న సందేహం. మరి నిజంగా పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సంతాన లేమి సమస్య వస్తుందా? పరిశోధనలు ఎం చెప్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పెర్ఫ్యూమ్ లో వాడే రసాయనాలు:

ఫథాలేట్స్:
ఈ రసాయనాలు ఇవి పరిమళాలను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అయితే, ఈ రసాయనాలు శరీరంలో హార్మోన్ల వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. ఈ విషయాన్ని పరిశోధనలు సైతం ధ్రువీకరించాయి. పురుషులలో వీర్య నాణ్యత తగ్గించడం, స్త్రీలలో గర్భసంచారణపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్యారబెన్స్:
ఇది ప్రిజర్వేటివ్‌గా ఉపయోగిస్తారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పదార్ధాలను xenoestrogens అంటారు. ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ లాంటి ప్రభావం చూపుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది.

సింటటిక్ మస్క్స్:
ఇది మస్క్ సువాసన కోసం వాడతారు. దీనికి శరీరంలో స్థిరపడే స్వభావం ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక ప్రభావం ఉండవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిశోధనల ఆధారంగా నిజాలు:

1.పురుషుల ఉత్పాదకతపై ప్రభావం:
అమెరికాలో జరిగిన కొన్ని అధ్యయనాలు ప్రకారం ఫథాలేట్స్ అధికంగా ఉన్న వ్యక్తుల్లో వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉంటుంది.

2.స్త్రీల ఫెర్టిలిటీపై ప్రభావం:
హార్వర్డ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనల ప్రకారం సువాసన ఉత్పత్తులను ఎక్కువగా వాడే స్త్రీలలో ఓవెలేషన్ లో మార్పులు వచ్చే ప్రమాదం ఉంది.

3.గర్భధారణ సమయంలో ప్రమాదాలు:
గర్భిణీ స్త్రీలు ఎక్కువగా సువాసన ఉత్పత్తులను వాడితే అది పిండంపై హార్మోన్ల మార్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరికొన్ని ముఖ్యమైన విషయాలు:

మనం వాడే ప్రతి పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సంతానలేమి వస్తుందనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఎక్కువగా కెమికల్స్‌తో నిండి ఉన్న పెర్ఫ్యూమ్‌లు వాడితే, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ద్వారా ఫెర్టిలిటీపై ప్రభావం చూపే అవకాశముంది. సహజసిద్ధమైన పెర్ఫ్యూమ్స్ వాడటం మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, పాతలేట్ ఫ్రీ అనే ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు మాత్రమే వాడండి
  • నేచురల్ పెర్ఫ్యూమ్స్ ఆధారంగా తయారు చేసినవి ఉపయోగించండి.
  • వాయుకాలుష్యం తగ్గించేందుకు ఇండోర్ ఎయిర్ ఫ్రెష్నర్ వాడకండి.