Diet Soda (Photo Credit : Google)
Diet Soda : మీకు డైట్ సోడా తాగే అలవాటు ఉందా? సోడాతో పోలిస్తే డైట్ సోడా ఆరోగ్యానికి కాస్త బెటర్ అని నమ్ముతున్నారా? అయితే.. మీరు జాగ్రత్త పడాల్సిందే. డైట్ సోడా ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిస్తే.. అస్సలు దాని జోలికి వెళ్లరేమో. డైట్ సోడా తాగడం వల్ల స్ట్రోక్ రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధనలో తేలింది.
డైట్ సోడాలో కేలరీలు లేదా చక్కెర ఉండదని ప్రచారం చేయబడింది. అయితే మీరు తాగుతున్నది ఏంటో తెలుసా. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదొక కార్బొనేటేడ్ సిరప్. కృత్రిమంగా, మిస్టరీ ఇన్ గ్రీడెంట్స్ తో తయారు చేసిందని నిపుణులు అంటున్నారు.
వాస్తవానికి.. ప్రజలు డైట్ సోడా ఎందుకు తాగుతున్నారు? అంటే.. సమాధానం లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. దీనికి కచ్చితంగా పోషక విలువలు లేవు. ఇక డైట్, రెగ్యులర్ సోడా మధ్య తేడా లేకపోలేదు. డైట్ సోడా రుచి కొంచెం తేడాగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే రెగులర్ సోడాతో పోలిస్తే డైట్ సోడా మంచిదని నమ్మి కొంతమంది వాటిని తెగ తాగుతున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు పొంచి ఉంది. అంతేకాదు డిమెన్షియాతో (జ్ఞాపక శక్తి తగ్గిపోవడం) బాధపడే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందంటున్నారు పరిశోధకులు.
బోస్టన్ యూనివర్శిటీ చోబానియన్, అవెడిసియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, రోజుకు ఒక్క డైట్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. అంతేకాదు డిమెన్షియా ముప్పు కూడా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఎలాంటి డైట్ డ్రింక్స్ తీసుకోని వ్యక్తులతో పోలిస్తే.. రోజుకు ఒక డైట్ డ్రింక్ తీసుకునే వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే స్ట్రోక్‌తో బాధపడే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని అధ్యయనంలో వెలుగు చూసింది.
అంతేకాదు.. వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా 2.9 రెట్లు ఎక్కువ అని తేలింది. డిమెన్షియా ముప్పు విషయానికి వస్తే.. మరింత పరిశోధన జరాగాల్సిన అవసరం ఉందన్నారు పరిశోధకులు. BUకి చెందిన పరిశోధకులు 4వేల మందిపై పదేళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ డేటాను విడుదల చేశారు.
Also Read : మీ పిల్లల పెంపకం సరిగానే ఉందా? మీరు సక్సెస్‌ఫుల్ పేరెంట్ అనుకుంటున్నారా? ఇదిగో చెక్‌లిస్ట్ మీకోసం..!