మీ పిల్లల పెంపకం సరిగానే ఉందా? మీరు సక్సెస్‌ఫుల్ పేరెంట్ అనుకుంటున్నారా? ఇదిగో చెక్‌లిస్ట్ మీకోసం..!
మీ పెంపకం సరైన రీతిలోనే ఉందా? లేదా? అని తెలుసుకోవడం ఎలా అని మదనపడుతున్నారా?

Successful Parent Signs (Photo Credit : Google)
Successful Parent : పిల్లలను చూసుకోవడం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. పెంపకం అనేది అంత ఈజీ కాదు. పెంపకం సరిగా లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి. పిల్లలు చెడు దారి పట్టే అవకాశం ఉంది. అందుకే, ఈరోజుల్లో ఓవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు పిల్లలను చక్కగా చూసుకునే తల్లిదండ్రుల రోల్ ను పోషించడం అంత ఈజీ కాదు.
పిల్లల పెంపకం టాస్కే అని చెప్పాలి. తమ పిల్లలు ఎంతో ఆనందంగా, తమ పట్ల నమ్మకంగా, స్వతంత్రంగా ఎదగాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, పిల్లలను చక్కగా చూసుకునే విషయంలో మీరు సక్సెస్ అయ్యారా? లేదా? మీ పెంపకం సరైన రీతిలోనే ఉందా? లేదా? అని తెలుసుకోవడం ఎలా అని మదనపడుతున్నారా? అదేం అంత పెద్ద కష్టం కాదు.. మీరు సక్సెస్ ఫుల్ పేరెంటా? కాదా? అన్నది కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.. అదెలా అంటే…
మీ పిల్లలు దొంగచాటుగా డబ్బు తీసుకోకుండా నేరుగా మిమ్మల్నే అడుగుతారు..
మీ పిల్లలను మీరు ఎలా పెంచారు అని తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. మీ పిల్లలు తమ అవసరాలకు డబ్బులు లేదా వస్తువులు దొంగతనంగా తీసుకోకుండా నేరుగా మిమ్మల్నే అడిగి తీసుకుంటారు. అలా అడిగారంటే.. మీరు సక్సెస్ ఫుల్ పేరెంట్ అని చెప్పొచ్చు. మీ పెంపకం సరైన పద్ధతిలోనే ఉందని చెప్పొచ్చు.
రహస్యంగానో లేదా దొంగతనంగానో తమకు కావాల్సిన వస్తువులు లేదా డబ్బులు తీసుకునే బదులు తల్లిదండ్రులను అడగటం మంచి విషయమే. అంటే, పిల్లలు మీ దగ్గర ఫ్రీగా, నిజాయితీగా ఉన్నట్లు చెప్పొచ్చు. ఏదైనా అవసరమైతే మీ అనుమతి తీసుకోవడం అనేది.. పరస్పర నమ్మకం ఉందని చెప్పేందుకు ఇది తొలి సంకేతం.
ఏ విషయమైనా ముందుగా మీతోనే షేర్ చేసుకుంటున్నారా…
పిల్లలు స్కూల్లో ఏదైనా సాధించినా, లేదా సమస్యను ఎదుర్కొన్నా.. వెంటనే తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలని అనుకోవడం సక్సెస్ ఫుల్ పేరెంటింగ్ లో మరో ప్రధాన అంశం. వేరే వాళ్ల కన్నా ముందుగా పేరెంట్స్ తోనే షేర్ చేసుకోవాలని అనుకున్నారంటే.. మీ పెంపకం సరైన పద్ధతిలో ఉన్నట్లే. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ కు ఇది నిదర్శనం. మంచి విషయం అయితే తమ తల్లిదండ్రులతో సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తారు. లేదా ఏదైనా సమస్యలో ఉంటే దానికి తల్లిదండ్రులే పరిష్కారం చూపిస్తారని పిల్లలు భావిస్తారు. ఇది గుడ్ పేరెంటింగ్ అని చెప్పొచ్చు.
సొంత మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి…
విజయవంతమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ అవసరమని ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటారు. మరీ ముఖ్యంగా వారి కెరీర్ లేదా అభిరుచుల విషయంలో. తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోష పెట్టే వాటిని కొనసాగించమని ప్రోత్సహించాలి. ఇది పిల్లవాడి సొంత కెరీర్ పాత్ ని ఎంచుకోవడానికి దారి ఏర్పరస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులు తమ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారని వారు అర్థం చేసుకుంటారు.
మీ పిల్లలు నమ్మకంగా తమ ఆలోచనలను వ్యక్తం చేస్తున్నారా..
సక్సెస్ ఫుల్ పేరెంటింగ్ కు మరొక సంకేతం ఏమిటంటే.. పిల్లలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తగినంత విశ్వాసాన్ని కలిగి ఉండటం. చాలా మంది పిల్లలు తమ ఆలోచనలను పేరెంట్స్ తో పంచుకోవడానికి భయపడతారు. ఎందుకంటే అవి తమ తల్లిదండ్రులను ఎక్కడ అప్ సెట్ చేస్తాయోనని. అలా కాకుండా ఎలాంటి భయాలు లేకుండా ఒక పిల్లవాడు తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకునేలా ఉండాలి. దాని అర్థం ఏంటంటే.. తన ఇంట్లో తన మాటకు, అభిప్రాయాలకు తల్లిదండ్రులు గౌరవిస్తారనే నమ్మకం అతడిలో ఉందన్న మాట.
పిల్లలు మీ పట్ల ప్రేమ, కేర్ చూపిస్తున్నారా…
పిల్లలు మీ పట్ల ప్రేమగా ఉంటూ మీ పట్ల కేర్ చూపిస్తున్నారు అంటే.. మీ పెంపకం సరైనదేనా అని చెప్పొచ్చు. వారు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే పెంపకం విషయంలో తల్లిదండ్రులుగా మీరు సక్సెస్ అయినట్లే. మీ బాగా అలసిపోయిన సమయంలో పిల్లలు మీకు పనుల్లో సాయం చేశారంటే.. మీరు పేరెంటింగ్ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయినట్లే. ప్రేమ, గౌరవం ఆధారంగా బలమైన బంధం విజయవంతమైన సంతాన లక్షణాలలో ఒకటి.
పిల్లలు తమ తప్పులను అంగీకరించడానికి భయపడరు..
సక్సెస్ ఫుల్ పేరెంటింగ్ లో మరొక ముఖ్యమైన సంకేతం.. పిల్లలు తమ తప్పులను సురక్షితంగా అంగీకరించే వాతావరణాన్ని సృష్టిస్తారు. మీ పిల్లలు ఏదైనా తప్పు పని చేసినా.. శిక్షిస్తారనే భయం లేకుండా మీ వద్దకు రాగలిగితే, చేసిన తప్పుని మీతో చెప్పగలిగితే.. వారు మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నారని చెప్పొచ్చు. పిల్లల్లో ఉండే ఈ నిజాయితీ తల్లిదండ్రులతో బలమైన సంబంధాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.
Also Read : ‘లైట్‌హౌస్ పేరెంటింగ్’ ఏంటి? ఈ విధానంతో కలిగే ప్రయోజనాలేంటి? పిల్లల ఆత్మగౌరవంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?