కరోనా తేలికపాటి లక్షణాలైనా.. దీర్ఘకాలిక అనారోగ్యానికి గురిచేస్తుంది : సైంటిస్టుల హెచ్చరిక

  • Publish Date - October 7, 2020 / 02:50 PM IST

Mild Covid-19 Infections : కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తున్నాయి. కొంతమందిలో తీవ్రమైన లక్షణాలు ఉంటే.. మరికొందరిలో లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. కరోనా స్వల్ప లక్షణాలు ఉంటే వెంటనే కోలుకోవచ్చు అనుకుంటే పొరపాటే.. లక్షణాలు స్వల్పమైన వాటి తీవ్రత అధికంగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది.



స్వల్ప లక్షణాలతో బాధపడేవారిలో ఎక్కువ మంది నెలల తరబడి అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారని ఫ్రాన్స్ రీసెర్చర్లు కనుగొన్నారు. కరోనా బాధితుల్లో మూడో వంతు మందిలో స్వల్ప లక్షణాలు మొదలైన 60 రోజుల తర్వాత వారు అనారోగ్యం బారినపడ్డారని గుర్తించారు. 40 ఏళ్ల నుంచి 60ఏళ్ల బాధితుల్లో ఆస్పత్రిలో చేరిన వారిలో దీర్ఘకాలిక కరోనా లక్షణాలు ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.



మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో స్వల్ప లక్షణాలు ఉన్న 150 మంది బాధితులపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల మంది SARS-CoV-2 virus బారినపడగా.. వారిలో లక్షణాల తీవ్రత వారాల నుంచి నెలల వ్యవధి కొనసాగినట్టు ఆధారాలు ఉన్నాయని journal Clinical Microbiology and Infection అధ్యయనాన్ని ప్రచురించారు.



కరోనా బాధితుల్లో ఎక్కువ మందిలో ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడం వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీసిందని గుర్తించారు. కరోనా లక్షణాలు అభివృద్ధి చెందిన రెండు నెలల తర్వాత 66 శాతం మంది యువకుల్లో 62 మందిలో ఒకరు ప్రధానంగా వాసన,రుచి కోల్పవడం, శ్వాస తీసుకోలేకపోవడం, అలసట వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని రీసెర్చర్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు