ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తిచెందుతోంది. వింటర్ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తిస్తోంది. వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని మెయిన్ ల్యాండ్ లో 2,700 కేసులను అక్కడి అధికారులు ధృవీకరించారు. బీజింగ్ లోనే తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది.
ఇప్పటికే వుహాన్ సిటీలోని సీఫుడ్ మార్కెట్ మూతపడిన సంగతి తెలిసిందే. పాములు, జంతువుల మాంసం తినడం ద్వారా మనుషుల్లోకి ఈ వైరస్ సోకి ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ వైరస్ మూలం ఎక్కడ ఉందని అనేదానిపై పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
చైనాకు తాళం : రవాణా సర్వీసులు బంద్
డ్రాగన్ దేశమైన చైనాలో దాదాపు 60 మిలియన్ల మంది ప్రజలపై ఈ కరోనా వైరస్ పాక్షికంగా ప్రభావం పడింది. దీంతో చైనీస్ నగరాలన్నీ పూర్తిగా తాళం వేసేశారు. వైరస్ నివారణ చర్యలను చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనీస్ సిటీలో తంగసాన్ రవాణా సర్వీసులను కూడా నిలిపివేసింది.
Read Also: కరోనా వైరస్ లీక్? : చైనా జీవాయుధాలతో వుహాన్ ల్యాబరేటరికి లింక్?
మంగళ వారం ఉదయం నుంచి అన్ని ప్రాంతీయ, ప్రజా రవాణా సర్వీసులను నిలిపివేసినట్టు నార్తరన్ చైనీస్ సిటీ ప్రకటించింది. హెబెయి ప్రావిన్స్ లోని తంగసాన్ లో మొత్తం 7.5 మిలియన్ల మంది ప్రజలు ఉంటున్నట్టు అక్కడి మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించింది. హెబాయిలో ఇప్పటివరకూ కరోనా వైరస్.. 18 వరకు కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. కానీ, తంగసాన్ సిటీలో మాత్రం ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు.
ప్రపంచ దేశాలకు కరోనా తాకిడి :
చైనాతో సహా ఇతర ప్రపంచ దేశాల్లో 50కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో చైనా మెయిన్ ల్యాండ్ బయటి 13 ప్రాంతాల్లోనే ఈ కరోనా వైరస్ మరింత వేగంగా విజృంభించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. యూనైటెడ్ స్టేట్స్ లో దాదాపు 5 మందికి ఈ వైరస్ సోకినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
లక్షణాలకు ముందే వ్యాప్తి :
ప్రాణాంతకమైన ఈ కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు బయటపడటానికి ముందే వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తోంది. ఇది అంటు వ్యాధి కావడంతో గాలి ద్వారా తొందరగా వ్యాప్తిస్తోంది. దీన్ని నియంత్రించేందుకు కష్టంగా మారుతోందని చైనా ఆరోగ్య శాఖ మంత్రి ఒకరు తెలిపారు.
Read Also: కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?
జర్మనీలో తొలి కేసు :
వుహాన్ కరోనావైరస్ జర్మనీ వరకు పాకింది. అక్కడ తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. మునీచ్ లోని బవారేయన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. స్ట్రాన్ బెర్గ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తెలిపింది.
ఆ వ్యక్తిని ప్రత్యేక ప్రదేశంలో ఉంచి వైద్యపరంగా అతడికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆరోగ్య, ఆహార భద్రతకు చెందిన రాష్ట్ర కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపింది. ఇప్పటివరకూ బవారేయన్ సిటీలో కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also : తెలిస్తే షాక్ అవుతారు: Corona Beer Virus కోసం ఇండియన్స్ సెర్చింగ్!