ప్రతి ప్రాణికి ఆక్సిజన్ కావాలి… ఒక్క దీనికి తప్ప…

  • Publish Date - February 27, 2020 / 07:16 AM IST

ఏడోతరగలి సైన్స్ లో మనం చదివేవుంటాం. బహుకణజీవులన్నింటికి ప్రాణాధారం ఆక్సిజనే. కొన్ని జంతువులు ఆక్సిజన్ లేకుండా కొంతకాలం వరకు బతుకుతాయికాని, అసలు ఆక్సిజన్ లేకపోతే ఈ భూమ్మీద ఎలాంటి ప్రాణి బతికలేదు. ఇది సైన్స్ చెప్పిన సత్యం. ఇప్పటిదాకా ఇదే నిజమేని అందరూ అనుకున్నారు. తాజాగా, ఇజ్రాయిల్ లెట్ అవీవ్ యూనివర్సిటి బహుకణపరాన్న జీవిని కనిపెట్టింది. చిత్రమేంటంటే…బతకడానికి ఈ జీవికి ఆక్సిజన్ అక్కర్లేదు. దీనికి  Henneguya salminicola అనిపేరుపెట్టారు. ఇది చాలా చిన్న ప్రాణి.  సముద్ర చేపలు, సముద్రగర్భ జీవుల్లో ఇది చేరి పరాన్నజీవిలా బతుకుతుంది.

ఆక్సిజన్ లేకపోతే  జీవంలేదన్నది మన సైంటిస్ట్ ల నమ్మకం. అందుకే చంద్రుడు, అంగారకుడిమీద నీరుందా? ఆక్సిజన్ ఉందానే అన్వేషణ. స్పేస్ లోనూ ఏకకణజీవులు బతుకుతాయని సైంటిస్ట్టుల దగ్గర ఆధారాలున్నాయి. ఈ కొత్త ప్రాణిలో మైటోకాండ్రియల్ జీనోమ్ లేదు.  డిఎన్ఏలోని ఈ భాగం శ్వాసక్రియకు సంబంధించింది. ఊపిరిపీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుంది. మరి ఇదే లేనప్పుడు ఈ ప్రాణికి శక్తి ఎక్కడ నుంచి వస్తుంది? ప్రస్తుతానికి సైంటిస్ట్టులకు ఇదోపజిల్.

2010లో ఇటలీలోని Marche Polytechnic University శాస్త్రవేత్తలు  loriciferans అనే చిన్న జీవులను మధ్యదరసముద్రగర్భంలో కనిపెట్టారు. ఈ బురదలో ఆక్సిజన్ అందదు. అలాగని  ఈ జీవులకు ప్రాణవాయువు లేకుండా బతుకుతాయన్న ఆధార్లాలేవు.