Joint Preservation : గుడ్ న్యూస్.. జాయింట్ ప్రిజర్వేషన్‌తో ఇక కీలు మార్పిడికి నో చెబుదాం..!

ఆర్థరైటిస్ మూడు, నాలుగు దశల్లో ఉన్నప్పుడు ఇక కీలు మార్పిడి తప్ప మరో మార్గం ఉండదు. కానీ తొలిదశలో అయితే జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీల ద్వారా వ్యాధి ముదరకుండా చేయవచ్చు. Joint Preservation - Knee Replacement

Joint Preservation - Knee Replacement

Joint Preservation – Knee Replacement : కీళ్ల నొప్పులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యే. ఈ మధ్య చిన్న వయసులోనే కీళ్లనొప్పుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక క్రీడాకారుల విషయంలో ఎముకలు, జాయింట్స్ కి సంబంధించిన సమస్యలు కామన్ గా మారాయి. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆర్థరైటిస్ ఎక్కువై, వరికి కీలు మార్పిడి సర్జరీ మాత్రమే పరిష్కారం అవుతుంది.

అయితే, ఇకపై అలాంటి సమస్య ఉండదు. రీప్లేస్ మెంట్ సర్జరీ దాకా వెళ్లకుండా ఆరోగ్యంగా ఉన్న జాయింట్ నే ప్రిజర్వ్ చేయగలిగితే.. చిన్న వయసులోనే కీళ్ల సమస్యలు వచ్చిన వాళ్లకు అద్భుత వరమే అవుతుంది. అందుకే యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జాయింట్ ప్రిజర్వేషన్ చికిత్సలపై ‘ప్రిజర్వ్’ పేరిట రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది.

Also Read..Cholesterol : ఉల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందా?

యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రెండు రోజుల సదస్సులో జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జరీలలోనే కాకుండా, రీప్లేస్ మెంట్ సర్జరీ అవసరం రాకుండా, సమస్య తొలి దశలోనే కీళ్లను ప్రిజర్వ్ చేసే చికిత్సా విధానాలను ప్రపంచవ్యాప్త వైద్య నిపుణులు తమ సర్జరీల నైపుణ్యాలను షేర్ చేసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు.

Joint Preservation – Yashoda Hospitals

ఇప్పటివరకూ స్పోర్ట్స్ ఇంజురీస్ కి సంబంధించిన సర్జరీల కోసం, క్రీడాకారులకు కావాల్సిన డాక్టర్ సలహాల కోసం ఎక్కువమంది క్రీడాకారులు విదేశాలకు వెళ్లడానికే మొగ్గు చూపే వాళ్లు. కానీ ఇండియా ఒక మెడికల్ హబ్ గా మారిన నేపథ్యంలో ఇప్పుడు మన దేశంలో అదీ హైదరాబాద్ లోనే అలాంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్రీడాకారులకు జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీలు చాలా అవసరమన్నారు గోపీచంద్.

మనదేశంలో ఆర్థరైటిస్ వల్ల 180 మిలియన్ల కంటే ఎక్కువమంది బాధపడుతున్నారు. డయాబెటిస్, క్యాన్సర్ లాంటి సమస్యల కన్నా ఎక్కువ సంఖ్యలో ఆర్థరైటిస్ పేషెంట్లు ఉన్నారు. దాదాపుగా 14 శాతం మంది ప్రతి ఏటా ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. వయసు ప్రభావం వల్ల కీళ్లు అరిగిపోయి, ఆర్థరైటిస్ రావడం ఒక ఎత్తయితే, ప్రమాదాల వల్ల కీళ్లు గాయపడి, దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువే. ముఖ్యంగా క్రీడాకారుల్లో ఆటల సమయంలో లిగమెంట్లు, టెండాన్లు దెబ్బతినడం, కీళ్లు గాయపడటం సర్వసాధారణం. ఇలాంటప్పుడు ఉపయోగపడే సర్జరీల గురించి తెలియజెప్పడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం.

Joint Preservation – Yashoda Hospitals

సాధారణంగా జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జరీ పెద్ద వయసు వాళ్లకే చేస్తారు. ఆర్థరైటిస్ సాధారణంగా నాలుగు దశల్లో ఉంటుంది. ఆర్థరైటిస్ మూడు, నాలుగు దశల్లో ఉన్నప్పుడు ఇక కీలు మార్పిడి తప్ప మరో మార్గం ఉండదు. కానీ తొలిదశలో అయితే జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీల ద్వారా వ్యాధి ముదరకుండా చేయవచ్చు. మొదటి రెండు దశల్లో ఉన్నప్పుడు జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ చేయించుకుంటే అది తీవ్రమైన ఆర్థరైటిస్ గా చేరకుండా నివారించవచ్చు.

Also Read.. Headache : తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని నివారణకు చిట్కాలు

కీలు మార్పిడి సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా చేయవచ్చు. కీలు గాయపడినప్పుడు లిగమెంట్స్, టెండాన్స్ లో సమస్య వచ్చినప్పుడు, ఆర్థరైటిస్ వల్ల కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, ఇంకా ఏ ఇతర సమస్య వల్ల కీలు దెబ్బతిన్నా ఈ సర్జరీలు ఉఫయోగపడుతాయి. స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు కూడా వెంటనే డాక్టర్ ని కలిస్తే అది తీవ్రతరం కాకుండా జాగ్రత్తపడొచ్చు.

మోకాలు అయినా, భుజం నొప్పి అయినా.. ఇలా ఏ జాయింట్ లో సమస్య ఉన్నా ఎర్లీ స్టేజ్ లో వస్తే ప్రిజర్వేషన్ చికిత్సల ద్వారా కీళ్లను కాపాడవచ్చంటున్నారు సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డాక్టర్ నితిన్ కుమార్. అందుకే నొప్పి మొదలైన వెంటనే ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ ని కలవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు