చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం, మాస్క్ ధరించడం.. ఈ మూడే శ్రీరామ రక్ష.. కరోనా ముప్పును తగ్గిస్తాయి : రీసెర్చ్

  • Publish Date - September 28, 2020 / 09:49 PM IST

Handwashing, distancing mask-wearing cut risk of catching : COVID-19 : కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ లేదు.. ప్రస్తుతానికి నివారణ ఒకటే మార్గం.. అంటే.. కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.

కరోనా ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షణగా ప్రధానంగా మూడు ఆయుధాలను ప్రయోగించాలంటున్నారు నిపుణులు.. ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్ల వరకు చేతులను తరచూ కడుక్కోవాలి. రెండోది భౌతిక దూరం పాటించాలి.



జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని తప్పక పాటించాలి.. మూడోది ముఖానికి మాస్క్ ధరించడం.. నోటికి మాత్రమే కాదు.. ముక్కు కూడా మూసి ఉండేలా మాస్క్ ధరించడం తప్పనిసరిగా చెబుతున్నారు.

ఈ మూడింటి విషయాల్లో జాగ్రత్తగా పాటిస్తే కరోనా మహమ్మారి ముప్పు తగ్గించగలవని ఓ కొత్త పరిశోధనలో తేలింది. ఫస్ట్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం నుంచి బయట పడకముందే కెనడాలో సెకండ్ వేవ్ మొదలైంది.



కెనడాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. ఒక నెలలోనే రెట్టింపు సంఖ్యకు పెరిగాయి. థాయిలాండ్ లోని రీసెర్చర్ల బృందం దేశంలో 211 కరోనా కేసులపై రీసెర్చ్ చేసింది. క్లస్టర్ ప్రాంతాలైన స్టేడియంలు, నైట్ క్లబ్బులు, ప్రభుత్వ అఫీసుల్లో నమోదైన కరోనా కేసులపై అధ్యయనం చేసింది.

ఇందులో అన్ని కేసులు అసింపథిటిక్ లక్షణాలుగా గుర్తించారు. బయటకు వెళ్లిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఒకరినొకరు మాస్క్ లేకుండానే మాట్లాడేస్తున్నారు. ఇలా 839 ఇతర వ్యక్తులకు కరోనా సోకిందని గుర్తించారు. వీరికి దగ్గరగా ఉన్న చాలా మందిలోనూ ఎలాంటి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించలేదని తేల్చారు.



లక్షణరహిత బాధితులతో కలిసిన 1,050 వేర్వేరు వ్యక్తులను పరిశోధకులు కొన్ని ప్రశ్నలు వేశారు.. పరిశుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. వీరిలో భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం చేసినవారిలో 85 శాతం కరోనా ముప్పు తగ్గిందని పరిశోధకులు నిర్ధారించారు. మాస్క్ ధరించడం ద్వారా వైరస్ బాధితులతో కలిసినా 77 శాతం కరోనా ముప్పును తగ్గించిందని తెలిపారు.



15నిమిషాల కంటే తక్కువ సమయం మాట్లాడిన వ్యక్తుల్లో కరోనా ముప్పు 76 శాతం మేర తగ్గిందని రీసెర్చర్లు గుర్తించారు. తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కునేవారిలో 66 శాతం మందిలో కరోనా ముప్పును తగ్గించిందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ మైక్రో బయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిర్వహించిన ఓ సదస్సులో ఈ వారం క్రితమే ప్రచురించారు.

ట్రెండింగ్ వార్తలు