ఎప్పుడూ లిఫ్టేనా.. సరదాగా మెట్లు ఎక్కండి… మెట్లు ఎక్కితే ఇన్ని లాభాలు..

అధిక బరువు సమస్యను తగ్గించడంలో మెట్లు ఎక్కడం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

Stairs Climbing Benefits

ప్రస్తుతం కాలంలో మనిషి శారీరక శర్మకు దూరం అవుతున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి బద్దకానికి బానిస అయిపోయాడు. అందుకే అనేకరకాల రోగాల బారిన పడ్తున్నారు. కాబట్టి మనిషికి శారీరక శ్రమ అనేది చాలా అవసరం. శారీరక శ్రమలో మెట్లు ఎక్కడం అనేది మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు అందుబాటులోకి వచ్చాక మెట్లు ఎక్కడం మర్చిపోయారు. తాత్కాలిక సౌలభ్యం కోసం లిఫ్ట్ లను వాడుతున్నారు. కానీ, మెట్లు ఎక్కడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువు సమస్యను తగ్గించడంలో మెట్లు ఎక్కడం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతీరోజు 6 నిమిషాల పాటు మెట్లు ఎక్కితే శరీరంలోని కొవ్వు శాతం 15% వరకు తగ్గిపోతుందట. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. జిమ్ వెళ్లే వీలు లేకపోయినా, జాగింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకుంటే శరీర బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. మెట్లు ఎక్కడం, దిగడం వల్ల కళ్ళు, తొడ కండరాలు, వెన్ను భాగంలో ఉండే కండరాలు బలపడతాయి. పరిశోధనల ప్రకారం 8 వారాల పాటు క్రమంగా మెట్లు ఎక్కినట్లయితే శారీరక బలం 10% నుండి 15% వరకు పెరుగుతుంది.

మెట్లు ఎక్కడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మెట్లు ఎక్కడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మెట్లు ఎక్కడం వల్ల రోజుకు కనీసం 300 కేలరీల వరకు ఖర్చు చేయవచ్చు. రోజు కనీసం 15 మీటర్ల మేర ఐదు సార్లు మెట్లు ఎక్కితే 302 కేలరీలు తగ్గించుకోవచ్చు. జాగింగ్ తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. కాబట్టి వీలైనంత మట్టుకు లిఫ్ట్ లను కాకుండా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.