Health benefits of doing brisk walking every day
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శారీరక శ్రమ చాలా అవసరం. అందుకోసం చాలా మంది జిమ్‌కి వెళ్ళడం, హార్డ్‌కోర్ వర్కౌట్స్, యోగా లాంటివి చేస్తూ ఉంటారు. వీటిలో అందరికీ అందుబాటులో ఉండేది నడక అనే చెప్పాలి. ఉదయం, సాయంత్రం నడిచే నడక ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ నడకలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్రిస్క్ వాకింగ్ ఒకటి. ఈ బ్రిస్క్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం:
బ్రిస్క్ వాకింగ్ అనేది సాధారణ నడక కన్నా వేగంగా చేసే నడక. దీన్ని తెలుగులో వేగమైన నడక అని చెప్పవచ్చు. ఇది ఒక విధమైన కార్డియో వ్యాయామం, మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
1.హృదయ ఆరోగ్యానికి మేలు:
బ్రిస్క్ వాకింగ్ హృదయాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది హృదయానికి మంచి వ్యాయామం. రక్తప్రసరణను మెరుగుపరచి, గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. బిపి, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
2.బరువు తగ్గడంలో సహాయం:
బ్రిస్క్ వాకింగ్ ద్వారా అధికంగా కాలరీలు ఖర్చవుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే మెటబాలిజం వేగంగా పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
3.మానసిక ఆరోగ్యం:
బ్రిస్క్ వాకింగ్ సమయంలో శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన సంతోష భావాన్ని పెంచుతుంది. డిప్రెషన్, ఆందోళనల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
4.మధుమేహం నియంత్రణ:
నిత్యం బ్రిస్క్ వాకింగ్ చేసే వారికి టైప్ 2 డయబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రనాలో ఉంచుతుంది.
5.కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
నడకతో కీళ్లకు నెమ్మదిగా కదలిక లభిస్తుంది. ఇది ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్, స్టిఫ్‌నెస్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పెరగడం వల్ల వచ్చే కీళ్ల సమస్యలను ఇది నివారిస్తుంది.