Health benefits of eating boiled sprouts during monsoon
వర్షాకాలం ఆరోగ్య సమస్యలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అంతేకాదు ఈ కాలంలో రోగనిరోధక శక్తి కూడా కొంత వరకు తగ్గుతుంది. అందుకే వర్షాకాలంలో తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మందిలో ఉండే అలవాటు ఏంటంటే ఆరోగ్యం కోసం ఉదయం పూట మొలకలు తినడం. అది కూడా పచ్చిగానే తింటారు. అయితే మొలకలు (Raw Sprouts) వంటి పదార్థాలను వర్షాకాలంలో పచ్చివి తినడం మంచిది కాదట. కారణం ఏంటి అనేది? ఎలా తినాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకలు పోషకాలతో నిండినవి. వీటిలో విటమిన్ B, C, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సాధారణంగా రక్తపోటు, షుగర్, హార్మోనల్ బ్యాలెన్స్ వంటి సమస్యల నియంత్రణకు సహాయపడతాయి. కానీ, వీటిని వర్షాకాలంలో పచ్చిగా తినకుందట.
1.బాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువ:
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో పచ్చి మొలకల్లో సాల్మొనెల్లా, ఇకోలి వంటి హానికరమైన సూక్ష్మజీవులు ఏర్పడే అవకాశాలు ఉంటుంది. మొలకల విత్తనాలు పొడి గాలిలో పెరిగితే ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. కానీ తేమ ఉన్న వాతావరణంలో ఇవి సులభంగా పాడయ్యే అవకాశం ఉంది.
2. జీర్ణ సమస్యలు:
పచ్చి మొలకలు కొన్ని సార్లు గ్యాస్, అజీర్తి, వాంతులు, డైరియా వంటి సమస్యలకు కారణమవుతాయి.
3.రోగనిరోధక శక్తి తగ్గినవారికి ప్రమాదం:
గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటిస్ ఉన్నవారు వర్షాకాలంలో పచ్చి మొలకలు తింటే మైక్రోబయల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగ ఉండాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన పచ్చి మొలకలు కూడా ఈ కాలంలో సురక్షితంగా ఉండకపోవచ్చు. కనుక పచ్చిగా తినకుండా, కొద్దిగా ఉడకబెట్టి తినడం ఉత్తమం. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రోగాలు దరిచేరనివ్వదు.