Broccoli: బ్రోక‌లీ రోజూ తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

బ్రోక‌లీలో కెరోటినాయిడ్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచింది. ఇది కంటి చూపు మెరుగు ప‌డేలా చేస్తుంది.

Broccoli benefits

చూసేందుకు అచ్చం కాలిఫ్ల‌వ‌ర్ లా ఉండే దీనిపేరు బ్రోక‌లీ. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అద్భుతం అనే చెప్పాలి. చూడటానికి చెట్టు లాగే ఉంటుంది కానీ ఎన్నో రోగాలకు చెక్ పెడుతుంది. ఇందులో అనేక పోష‌కాలు దాగి వున్నాయి. అందుకే దీనికి మన రోజువారీ ఆహరంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. వైద్యులు, పోష‌కాహార నిపుణులు సైతం మెరుగైన ఆరోగ్యం కోసం బ్రోక‌లీ తినమని చెప్తున్నారు. విట‌మిన్ సి అధికంగా ఉండే బ్రోక‌లీ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇంకా బ్రోక‌లీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రోక‌లీలో కెరోటినాయిడ్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచింది. ఇది కంటి చూపు మెరుగు ప‌డేలా చేస్తుంది. శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్ములిస్తుంది. క‌ణాలను బలోపేతం చేస్తుంది. క్యాన్స‌ర్ కారకాలను నిరోధిస్తుంది. బ్రోక‌లీలో విట‌మిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లకు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

బ్రోక‌లీలో ఉండే విట‌మిన్ కె గాయాలు అయిన‌ప్పుడు జరిగే ర‌క్తంస్రావాన్ని తగ్గిస్తుంది. రక్తం త్వరగా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే ఫోలేట్ విట‌మిన్ బి9 గ‌ర్భిణీస్ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. బ్రోక‌లీలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ లో ఉండటానికి సహాపడుతుంది. ఇంకా ఇందులో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది, కండ‌రాల ప‌నితీరును బాగు చేస్తుంది.

బ్రోక‌లీ రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఐర‌న్ ర‌క్తంలో ఆక్సిజ‌న్ ర‌వాణాకు స‌హాయం చేస్తుంది. దీనివల్ల ర‌క్త‌హీన‌త వచ్చే అవకాశం చాలా తక్కువ. బ్రోక‌లీని తిన‌డం వ‌ల్ల శరీరానికి క్యాల్షియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది దంతాల‌ను, ఎముక‌లు దృఢంగా ఉండేలా చేస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచే మెగ్నిషియం కూడా బ్రోక‌లీలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బ్రోక‌లీలో విట‌మిన్లు ఇ, ఎ, ఫాస్ఫ‌ర‌స్‌, బి6, జింక్ కూడా అధికంగా ఉంటుంది. ఇంకా బ్రోక‌లీలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ కార‌కాలుగా పనిచేసి అంత‌ర్గ‌తంగా వ‌చ్చే వాపులు తగ్గిస్తుంది.