Health benefits of eating Cauliflower
కాలిఫ్లవర్ (Cauliflower) మన రోజువారీ ఆహారంలో భాగంగా ఉన్న ఎంతో శక్తివంతమైన కూరగాయ. ఇది పుష్పకూరల జాతికి చెందినది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు అధికంగా లభిస్తాయి. కాబట్టి, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయగలదు. మరి కాలిఫ్లవర్ తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.పోషక విలువలతో నిండిన ఆహారం:
కాలిఫ్లవర్‌లో విటమిన్ C, విటమిన్ K, విటమిన్ B6, ఫోలేట్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. ఇది తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలు అందించగలదు. కాబట్టి ఫ్యాట్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
2.మిగ్రిన్లను తగ్గించడంలో సహాయం:
ఈ మధ్య కాలంలో యువతలో అధికంగా కనిపిస్తున్న సమస్య మిగ్రిన్. కాలిఫ్లవర్‌లో ఉండే విటమిన్ B6 మిగ్రేన్ తలనొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3.జీర్ణవ్యవస్థకు మేలు:
కాలిఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
4. క్యాన్సర్ నిరోధక లక్షణాలు:
కాలిఫ్లవర్‌లో గ్లూకోసినోలేట్స్ (Glucosinolates), ఇసోథియోసైనేట్స్ (Isothiocyanates) వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, లంగ్స్, బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్‌లను నివారించడంలో ఇది సహాయకారిగా ఉంటుంది.
5. గుండె ఆరోగ్యానికి మంచిది:
కాలిఫ్లవర్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోటాషియం గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును సైతం తగ్గిస్తుంది.
6.బరువు తగ్గే వారికీ అనుకూలం:
కాలిఫ్లవర్ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావాన్ని కలిగించి తక్కువ తినేలా చేస్తుంది. కాబట్టి డైట్ లో భాగంగా దీనిని చేర్చుకోవచ్చు.
7.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
కాలిఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.కాలిఫ్లవర్ లో ఉండే విటమిన్ C శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. శరీరంపై ఏర్పడే గాయాల్ని కూడా త్వరగా మాన్పిస్తుంది.