Meal Maker Benefits: మీల్‌ మేకర్‌ తో ముసలితనానికి చెక్.. డయాబెటీస్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు

మీల్‌ మేకర్‌ ను సోయాతో తయారు చేస్తారు. అందుకే దీనిని సొయా చంక్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

meal maker benefits

మీల్‌ మేకర్‌.. దీన్ని వెజిటేరియన్స్ నాన్ వెజ్ అని కూడా పిలుస్తారు. మాంసం తిననివారికి ఇది ప్రత్యామ్నాయంగా చెప్తారు. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు కూడా. ఇంతకాలం ఇది మనకు ఒక వంట పదార్థం లాగానే తెలుసు కానీ, ఇందులో ఉన్న పోషకాల గురించి తెలిస్తే అస్సలే వదిలిపెట్టరు. నిపుణుల సూచనల మేరకు మీల్‌ మేకర్‌ లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయట. ప్రతిరోజు దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి మీల్‌ మేకర్‌ ను సోయాతో తయారు చేస్తారు. అందుకే దీనిని సొయా చంక్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు కూడా ఉండవని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇంకా మీల్‌ మేకర్‌ లో ప్రొటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌, సెలీనియం లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే మీల్‌ మేకర్‌ తరచుగా డైట్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రోటీన్ అధికంగా అందించే ఆహారాల్లో మీల్‌ మేకర్‌ ఒకటి. వెజిటేరియన్ మటన్ గా పిలుచునే ఈ పదార్థం మసిల్ పెరుగుదలకు సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్ అందించే అద్భుతమైన ఆహారపదార్థం మీల్‌ మేకర్‌. ఇంకా ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది డైబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్‌ గా నిపుణులు చెప్తున్నారు.

మీర ముఖ్యంగా సోయా ఫుడ్స్‌తో తయారయ్యే మీల్‌ మేకర్‌ అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా వివిధ సీజనల్ సమస్యలను దూరం చేస్తుందది. ఇంకా దీనిలో మటన్‌, చికెన్‌, గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది. అందుకే ప్రొటీన్‌ లోపంతో బాధపడేవారు మీల్‌ మేకర్‌ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.​ అయితే.. ఏ ఆహారాన్నైనా మితంగానే తీసుకోవాలి. అమితంగా తింటే ఏదైనా ప్రమాదమే. కాబట్టి మీల్‌ మేకర్‌ కూడా రోజుకు ఒక కప్పు మించకుండా తీసుంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.