Pumpkin Seeds Benefits: గుండెను రక్షించే గుమ్మడి గింజలు.. ప్రోటీన్లు, పోషక విలువలు.. ఇలా చేసుకొని తినండి

Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజల్లో ఉండే ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, మెగ్నీషియం గుండె ధమనులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Health benefits of eating pumpkin seeds

సాధారణంగా గుమ్మడి కాయ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. మనిషి ఆరోగ్యానికి అవసరమయ్యే అనేకపోషకాలను అందిస్తుంది గుమ్మడి కాయ. అయితే, కేవలం గుమ్మడి కకాయ మాత్రమే కాదు దానిలోని గింజల్లోనూ అపూర్వమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయట. గుమ్మడి గింజలు (Pumpkin Seeds) చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకవిలువలు దాగి ఉన్నాయట. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు:

100 గ్రాముల గుమ్మడి గింజల్లో ప్రోటీన్ 30 గ్రాములు, మంచి కొవ్వులు 45 గ్రాములు, మెగ్నీషియం 262 మి.గ్రా, జింక్ 7.8 మి.గ్రా, ఐరన్ 8.8 మి.గ్రా, ఫైబర్ 6-7 గ్రాములు, విటమిన్లు E, K, B2, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు లాంటి పలు రకాల ఫినాలిక్ అనుసంధానాలు ఉన్నాయి.

గుమ్మడి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
గుమ్మడి గింజల్లో ఉండే ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, మెగ్నీషియం గుండె ధమనులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

2.నిద్రకు సహాయపడతాయి:
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సెరోటొనిన్, మెలటొనిన్గా మార్చి నిద్రను మెరుగుపరుస్తుంది.

3 ప్రోస్టేట్ ఆరోగ్యానికి మేలు:
ముఖ్యంగా పురుషులకు గుమ్మడి గింజలు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. గుండు, జుట్టు సమస్యల నివారణకూ ఇందులోని జింక్ ఉపయోగపడుతుంది.

4.ఇమ్యూన్ సిస్టమ్ బలపరుస్తుందిల:
గుమ్మడి గింజల్లో ఉండే జింక్, విటమిన్ E రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి వ్యాధుల నుంచి రక్షించే శక్తిని ఇస్తుంది.

5.ఐరన్ తో రక్తహీనతకు పరిష్కారం:
గుమ్మడి గింజల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.

6. హార్మోన్ల సమతుల్యతకు తోడ్పాటు:
మహిళల్లో వచ్చే PCOS వంటి హార్మోనల్ సమస్యలకు ఇది చాలా సహకారంగా ఉంటుంది. మెనోపాజ్ సమయంలో తలెత్తే చురుకైన రసాయన మార్పుల్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. దీన్ని మహిళలు రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

7.ఆంటీఆక్సిడెంట్ లక్షణాలు:
శరీరంలోని సెల్స్‌ను రక్షించే యాంటీఆక్సిడెంట్లు గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

8.మలబద్ధక నివారణ, జీర్ణశక్తి మెరుగుదల:
గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

గుమ్మడి గింజలు ఎలా తీసుకోవాలి?

  • ఉదయం ఖాళీ కడుపుతో 1–2 టీస్పూన్లు తీసుకోవాలి.
  • పచ్చిగా లేదా లైట్‌గా వేయించి తీసుకోవచ్చు.
  • సాలడ్‌లలో, స్మూతీలలో, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో కలిపి తినవచ్చు.
  • చాట్నీ లేదా కుర్మాలో కూడా ఉపయోగించవచ్చు.