Site icon 10TV Telugu

Tuna Fish Benefits: గుండె జబ్బులు మాయం.. మెదడు ఆరోగ్యం సేఫ్.. ట్యూనా చేపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of eating Tuna Fish

Health benefits of eating Tuna Fish

సాధారణంగా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. అయితే చేపల్లో ఒకరకమైన ట్యూనా చేపలు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇది మనిషి ఆరోగ్యానికి దివ్యౌషధంగా చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సముద్ర ఆహారాల్లో ట్యూనా చేప ఒకటి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా, పుష్కలమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. ట్యూనా చేపలను తరచుగా తినడం వల్ల అనేక రకాల రోగాలు రాకుండా జాగ్రత్తపడవచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ట్యూనా చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన ఇప్పుడు తెలుసుకుందాం.

1.హృదయ ఆరోగ్యానికి మంచిది:
ట్యూనా చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిసెరైడ్‌లను తగ్గించి, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేగాక, ఇది హై బీపీని కూడా నియంత్రనలో ఉంచుతాయి.

2.ప్రోటీన్ సమృద్ధి:
ట్యూనా చేపల్లో ప్రోటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. శరీర కండరాల నిర్మాణానికి, మేనటెనెన్స్‌కు, గాయాలు మానిపించేందుకు ఇది కీలకంగా పనిచేస్తుంది. ప్రోటీన్ అధికంగా అవసరమయ్యే వారికీ, ముఖ్యంగా వ్యాయామం చేసే వారి కోసం ఇది అద్భుతమైన ఆహారం అనే చెప్పాలి.

3.తక్కువ కొవ్వు, బరువు నియంత్రణ:
ట్యూనా చేపలు తక్కువ కొవ్వుతో అధిక పోషక విలువ కలిగి ఉంటాయి. ఇది బరువు తగ్గించుకోవాలని అనుకునే వారికి సరైన ఎంపిక. ఇది తక్కువ కేలరీలతో ఎక్కువ తృప్తి కలిగించే ఆహారంగా ఉంటుంది.

4.మెదడు ఆరోగ్యానికి మేలు:
ట్యూనా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ట్యూనా తినడం ద్వారా మేధస్సు, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. దీమెన్షియా, ఆల్జీమర్స్ లాంటి వ్యాధుల సైతం రాకుండా చేస్తుంది.

5.విటమిన్‌లు, ఖనిజాల సమృద్ధి:
ట్యూనాలో విటమిన్ B12, విటమిన్ D, ఐరన్, సెలెనియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి హీమోగ్లోబిన్‌ను పెంచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరానికి శక్తినిచ్చే ప్రక్రియల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

6.దృష్టి శక్తికి మేలు:
ట్యూనాలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి. ట్యూనా తినడం వల్ల పెద్దవయసుల్లో వచ్చే మాక్యులర్ డిజెనరేషన్ వంటి సమస్యలు తక్కువ అవుతాయి.

ట్యూనా చేపలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఒకటి. ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించగలవు. అయితే మితంగా తీసుకుంటేనే. ఆరోగ్యవంతమైన జీవనశైలిలో భాగంగా ట్యూనాను చేర్చడం ద్వారా మీరు శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండవచ్చు.

Exit mobile version