రాత్రి భోజనం తరువాత తేలికపాటి నడక చాలా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకుంటారు. ఇలా చేయడం వల్ల అనేకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతీ ఒక్కరు ఇది అలవాటు చేసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం:
రాత్రి భోజనం తరువాత చిన్న నడక చేయడం వల్ల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియకు సహాయపడుతుంది. భోజనం తినడం తర్వాత శరీరంలోని రక్తప్రసరణ పెరిగి, జీర్ణక్రియ త్వరగా సాగుతుంది. ఇది పోషకాలను శరీరానికి అందించడంలో, అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
2.గ్యాస్, ఉబ్బరం తగ్గించడం:
భోజనం చేసిన తరువాత రెస్ట్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య లేదా మలబద్ధకం సమస్యలు రావచ్చు. చిన్న నడక చేయడం వల్ల మేలైన పరిష్కారం దొరుకుతుంది. నడక సమయంలో శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వలన గ్యాస్, ఫుల్‌నెస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి.
3.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం:
రాత్రి భోజనం తరువాత నడక చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులకి ఇది చాలా ముఖ్యం. ఆహారం జీర్ణమవుతున్న సమయంలో శరీరంలో చక్కెర ప్రభావం చూపి, ఇన్‌సులిన్ స్థాయిలను తగ్గించి, అతి అధిక రక్త చక్కెర స్థాయిలను నివారిస్తుంది.
4.రాత్రి నిద్ర మెరుగుపరచడం:
తిన్న తరువాత నడవండం రాత్రి నిద్రకి మంచిది. శరీరంలోని ఒత్తిడి తగ్గి, మానసిక శాంతి పొందడంలో సహాయపడుతుంది. ఎవరైనా ఒత్తిడిలో ఉంటే, ఒక చిన్న నడక వాళ్ళకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది.
5.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం:
భోజనం తరువాత నడక వలన శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ రక్త ప్రసరణం, హృదయానికి సంబంధించి పోషకాలు సరఫరా చేస్తుంది. చెడు కొలెస్టరాల్ (LDL) ను తగ్గిస్తుంది. దీని వలన హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
6.బరువు తగ్గడం:
ప్రతి రోజు భోజనం తరువాత చిన్న నడక పొట్ట చుట్టూ పెరిగిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
నడక చేయడంలో కొన్ని చిట్కాలు:
- తిన్న తరువాత నడకను చాలా తేలికగా మొదలు పెట్టాలి.
- మొదట్లో 5 నుంచి 0 నిమిషాల పాటు నడక చేయడం ప్రారంభించి, క్రమంగా సమయాన్ని పెంచవచ్చు.
- ఎక్కువ వేగంగా నడిస్తే శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది.