Junk Food: జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఆరోగ్యాన్ని పనంగా పెట్టినట్టే.. ఈ తిప్పలు తప్పవు

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది పిల్లలు, యువత, పెద్దలు కూడా ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్(Junk Food) వైపు ఆకర్షితులవుతున్నారు.

Health problems caused by eating too much junk food

Junk Food: ప్రస్తుత జీవనశైలిలో చాలామంది పిల్లలు, యువత, పెద్దలు కూడా ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారు. మంచి రుచి, తొందరగా తయారవడం, ప్రకటనల ప్రభావం వంటి కారణాలతో వీటి వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. కానీ దీని ఫలితంగా ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాలు పడుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు. కాబట్టి, జంక్ ఫుడ్(Junk Food) మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Health Tips: మీ ఆరోగ్యం మీ నాలుకపైనే.. ఇలా మారితే ప్రమాదంలో ఉన్నట్టే.. గమనిస్తే ముప్పు తొలగినట్టే

జంక్ ఫుడ్ అంటే ఏమిటి?
జంక్ ఫుడ్ అనేది అధిక క్యాలొరీలు, కొవ్వు (Fat), చక్కెర, ఉప్పు ఉండే ఆహారం. ఇందులో పోషక పదార్థాలు పొటాషియం, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, చిప్స్, బేకరీ ఐటమ్స్, బాటిల్ పానీయాలు, కూల్ డ్రింక్స్, మాగీ, నూడిల్స్, స్నాక్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి.

జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి కలిగే హానికర ప్రభావాలు:

1.బరువు పెరగడం:

జంక్ ఫుడ్‌లో అధికంగా ఉండే క్యాలొరీలు, తక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి త్వరగా వేస్తుంది. దీంతో ఎక్కువగా తినడం జరుగుతుంది. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది.

2.గుండె సంబంధిత వ్యాధులు:

ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉండే ఫుడ్‌లు రక్తనాళాల్లో కొవ్వు నిల్వ అవ్వడానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ, హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

3.మెదడు పనితీరు తగ్గించడం:

జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో స్మృతి సమస్యలు, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది పోషకాహారం కాకపోవడం వల్ల మెదడుకు సరైన శక్తి అందదు.

4.టైప్ 2 మధుమేహం:

వీటిలో ఉండే అధిక చక్కెరల కారణంగా ఇన్సులిన్ స్థాయిలు అసమతుల్యంగా మారతాయి. దీర్ఘకాలికంగా ఇది బ్లడ్ షుగర్ సమస్యకు కారణం అవ్వొచ్చు.

5.పళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం:

సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్లు, ప్రాసెస్డ్ స్వీట్స్‌ వలన దంతాలు పాడవుతాయి, గంబీలు దెబ్బతింటాయి.

బదులుగా తినదగ్గ ఆరోగ్యకరమైన ఆహారం:

  • ఇంట్లో చేసిన రొట్టె/రాగి దోసె
  • ఉప్పు చిమ్మిన బేక్ చేసిన ఆలూ
  • డ్రై ఫ్రూట్స్, నట్‌లు
  • తాజా ఫల జ్యూస్ లేదా మజ్జిగ
  • గోదుమ లడ్డు, ఖర్జూరం, జీళ్లకర్ర మిశ్రమం.