Health Tips: మీ ఆరోగ్యం మీ నాలుకపైనే.. ఇలా మారితే ప్రమాదంలో ఉన్నట్టే.. గమనిస్తే ముప్పు తొలగినట్టే
మన ఆరోగ్య స్థితిని సూచించడంలో(Health Tips) నాలుక కీలక పాత్ర పోషిస్తుంది. పూర్వకాలం నుంచే వైద్యులు పేషెంట్ ఆరోగ్యాన్ని అంచనా

Health Tips: These 5 symptoms on the tongue are the cause of health problems
Health Tips: మన ఆరోగ్య స్థితిని సూచించడంలో నాలుక కీలక పాత్ర పోషిస్తుంది. పూర్వకాలం నుంచే వైద్యులు పేషెంట్ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో నాలుకను పరిశీలించేవారు. ప్రస్తుత కాలంలో కూడా కొంత మంది అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. నాలుకపై(Health Tips) కనిపించే కొన్ని మార్పులు ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉంటాయి. మరి లక్షణం ఏ వ్యాధికి సంకేతం అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.తెల్లటి పరట్టు:
సాధారణంగా నాలుకపై తెల్లటి పొర పేరుకుపోవడాన్ని మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఇది ఒకరకమైన ఓరల్ కాండిడియాసిస్ (Oral Thrush) సమస్య. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల గాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణం, ఆమ్లపిత్తం వల్ల వస్తుంది. కొన్ని సార్లు నాలుకను శుభ్రంగా ఉంచకపోతే కూడా ఇలా కనిపించే అవకాశం ఉంది.
2.ఎరుపుగా, పచ్చగా మారడం:
విటమిన్ B12 లోపం వల్ల నాలుక ఎరుపుగా మారుతుంది. నొప్పిగా కూడా ఉండవచ్చు. జ్వరం, ఇన్ఫెక్షన్, మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ వల్ల నాలుక పచ్చటి వర్ణం రావచ్చు. లివర్ సమస్యలు, బైల్ సెక్రిషన్ సమస్యల వల్ల కూడా నాలుక పచ్చగా మారవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సరైన ఆహార నియమాలు పాటించాలి, అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి వైద్యుడిని సంప్రదించాలి.
3.చీలిన నాలుక:
వృద్ధాప్యం, వయస్సు పెరిగేకొద్దీ ప్రకృతి సిద్ధంగా ఈ లక్షణం కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో విటమిన్ లోపం ముఖ్యంగా విటమిన్ B సమ్మేళనాల లోపం వల్ల ఇది కనిపించవచ్చు. నోటి తడిఆరిపోవడాన్ని నివారించడం, వైద్య సలహా తీసుకోవడం అవసరం.
4.చీకటి గాట్లు లేదా మచ్చలు:
ఎక్కువగా పొగ తాగేవారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. మెలానిన్ పేరుకుపోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో మెలానోమా (ఒక రకమైన క్యాన్సర్) సంకేతం కావచ్చు.కాబట్టి, ఈ లక్షణ్ ఉంటె వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
5.మూలికలు,పొడిబారిన నాలుక:
శరీరంలో నీరు తగ్గిపోతే నాలుక పొడిగా మారుతుంది. మహిళలలో హార్మోనల్ మార్పుల కారణంగా నాలుక ఇలా కావచ్చు. నోరు పొడిబారటం కొన్నిసార్లు డయాబెటిస్ లక్షణం కావచ్చు. నీటిని ఎక్కువగా తీసుకోవాలి, బ్లడ్ షుగర్ లెవల్స్ పరీక్షించుకోవాలి.