Multivitamin Tablets: మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా? జాగ్రత్తలు తప్పనిసరి

Multivitamin Tablets: వివిధ రకాల విటమిన్లు విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్,C, D, E, K, ఖనిజాలను కలిపి చేసిన టాబ్లెట్స్ ను మల్టీవిటమిన్ టాబ్లెట్లు అంటారు.

Health problems caused by taking too many multivitamin tablets

ప్రజెంట్ జనరేషన్ లో జీవనశైలి చాలా వేగంగా మారుతోంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది శరీరానికి పోషకాలను అందించేందుకు డాక్టర్ సలహా లేకుండానే మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్నారు. ఇలా ఎలా పడితే అలా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడటం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

మల్టీవిటమిన్లు అంటే ఏమిటి?

వివిధ రకాల విటమిన్లు విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్,C, D, E, K, ఖనిజాలను కలిపి చేసిన టాబ్లెట్స్ ను మల్టీవిటమిన్ టాబ్లెట్లు అంటారు. వీటిని శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం కోసం వాడతారు.

మల్టీవిటమిన్లు వాడటం వల్ల కలిగే సమస్యలు:

1.విటమిన్ ఓవర్‌డోస్:
విటమిన్లు ఎక్కువగా శరీరంలోకి చేరడం వల్ల విషప్రభావాలు కలిగిస్తాయి. ముఖ్యంగా విటమిన్ A అధికంగా తీసుకుంటే తలనొప్పి, తల తిరగడం, లివర్ నష్టం, దృష్టి సమస్యలు రావచ్చు. విటమిన్ D అధికంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం రావచ్చు. ఐరన్ అధికంగా తీసుకుంటే వికారం, వాంతులు, కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావచ్చు.

2.అలర్జిక్ ప్రతిక్రియలు:
కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్లలో కలపబడ్డ పదార్థాలకు కొందరికి అలర్జీలు కలగవచ్చు. చర్మంపై ర్యాషెస్, వాంతులు, ఛాతిలో ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు.

3.జీర్ణ సమస్యలు:
ఖాళీ కడుపుతో మల్టీ విటమిన్‌లు తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు రావొచ్చు.

4.హార్మోనల్ అసమతుల్యత:
బీ కాంప్లెక్స్, జింక్ వంటివి అదుపు లేకుండా తీసుకుంటే శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గించవచ్చు.

5.ఇతర ఔషధాలపై ప్రభావ:
మీరు ఇతర మందులు (ఉదాహరణకు బీపీ, షుగర్, థైరాయిడ్ మందులు) వాడుతున్నట్లయితే, మల్టీవిటమిన్లు అవి పని చేసే తీరును తగ్గించవచ్చు. కాల్షియం మందుల్ని తీసుకుంటే ఐరన్‌ శోషణను తగ్గే అవకాశం ఉంది. విటమిన్ K కొవ్వు కరిగించే మందులను ప్రభావితం చేయవచ్చు.

జాగ్రత్తలు:

  • డాక్టర్ సలహాతో మల్టీవిటమిన్లు వాడండి
  • అవసరమైన టెస్టులు చేయించుకోవాలి
  • నిర్ధేశించిన మోతాదులోనే వాడాలి
  • ఖాళీ కడుపుతో తీసుకోకూడదు