Disadvantages of using Earbuds
ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్లూటూత్ ఇయర్ ఫోన్లు (Bluetooth Earphones) మన దైనందిన జీవనశైలిలో భాగమైపోయాయి. వర్క్ కాల్స్, సంగీత వినోదం, వీడియోలు, గేమింగ్ ఇలా అన్నిచోట్లా వీటిని వినియోగించబడుతున్నాయి. వైర్లు, కేబుల్స్ వల్ల కలిగే చికాకును ఇవి తగ్గిస్తాయి కాబట్టి వీటి వినియోగం ఎక్కువ అవుతుంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్లను దీర్ఘకాలికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి ముప్పును కలిగించవచ్చని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు, చెవి వంటి అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
1.రేడియేషన్ ప్రభావం:
బ్లూటూత్ డివైసులు అల్ప స్థాయిలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను (EMF) విడుదల చేస్తాయి. ఈ కిరణాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మెదడుకు దగ్గరగా ఉంచడం వల్ల దీర్ఘకాలంలో ప్రభావాలు ఉండే అవకాశాలు పరిశోధనలు చెప్తున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలికంగా ఈ తరహా కిరణాల ప్రభావంతో మెదడు కణజాలాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది.
2.వినికిడిపై ప్రభావం:
చాలా మంది అధిక శబ్దం (high volume)లో బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు వాడుతుంటారు. దీని వల్ల చెవి నాడులపై ఒత్తిడి పెరిగి, వినికిడి సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. నిరంతర వాడకం వల్ల శాశ్వత నష్టం కలిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3.మెదడు ఆరోగ్యంపై ప్రభావం?
బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడుకు బాగా దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దీన్ని ఉపయోగించే సమయంలో మెదడు చట్రాలపై స్వల్ప ఉష్ణత మార్పులు సంభవించే అవకాశం ఉంది. దీనిపై నిపుణులు సైతం అధ్యాయనాలు చేస్తున్నారు. ఇంకా స్పష్టత రాలేదు.
4.నిద్రలేమి, మానసిక ఒత్తిడి:
బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం ఆడియో వినడం, కాల్స్ మాటాడటం వంటివి చేయడం వల్ల నిద్ర, ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రలేమి, ఒత్తిడి, మానసిక అలసటకు దారితీయవచ్చు.
బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు సౌకర్యాన్ని అందించినా, హానికరం కూడా కావచ్చు. సాంకేతికతను మితంగా, జాగ్రత్తగా వాడటం వల్ల మానవ ఆరోగ్యంపై ప్రభావం తగ్గుతుంది. “వాడతాం కానీ జాగ్రత్తగా వాడతాం” అనే దృష్టికోణంతో టెక్నాలజీని ఉపయోగించండి.