Health risks of eating biscuits with tea
మనలో చాలా మందికి ఉదయం, సాయంత్రం టీ తాగేటప్పుడు బిస్కెట్లను తినడం అలవాటు ఉంటుంది. ఇది ఒక రకమైన స్నాకింగ్ గా మారిపోయింది. నిజానికి ఈ రెండిటి కలయిక మంచి రుచిని అందిస్తాయి. అందుకే చాలా మంది టీ, బిస్కెట్స్ తినడాన్ని ఇష్టపడతారు. అయితే, చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే? ఇలా తినడం మంచిదేనా కాదా అని? ఇప్పుడు అదే విషయం గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.
మైదా: ఇది ఫైబర్ లేని కార్బోహైడ్రేట్. బ్లడ్ షుగర్ తక్షణంగా పెంచుతుంది
పంచదార: దీనిలో అధిక గ్లైసెమిక్ ఇన్‌డెక్స్ ఉంటుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది
ట్రాన్స్ ఫ్యాట్ / మార్గరిన్: ఇది కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండె సమస్యల వచ్చే అవకాశం ఉంది
సేమెంట్ లాంటి క్రీములు రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి అనారోగ్యాన్ని కలగజేస్తాయి.
1.బ్లడ్ షుగర్ లో ఎత్తుపల్లాలు:
టీ తో కలిపి బిస్కెట్లు తినగానే బ్లడ్ షుగర్ తక్షణంగా పెరుగుతుంది. తరువాత కాసేపటికి మళ్లీ తగ్గుతుంది. దీనివల్ల అలసట, ఆకలి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది టైప్ 1 డయాబెటీస్ కి ప్రధాన లక్షణం కావచ్చు.
2.బాడీకి ఖాళీ క్యాలరీలు:
బిస్కెట్లలో శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్ల లాంటి ఎలాంటి న్యూట్రియంట్లు ఉండవు. కేవలం అనవసరమైన క్యాలరీలను అందికంగా అందిస్తుంది.
3.బరువు పెరగడం:
రోజూ టీతో 2 నుంచి 3 బిస్కెట్లు తినడం వలన కొన్ని వందల క్యాలరీలు శరీరంలో అదనంగా చేరుతాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవ్వచ్చు
4.దంత సమస్యలు:
పంచదార కలిగిన బిస్కెట్లలో గ్లూజీగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పళ్ళకు అతుక్కుంటాయి క్యావిటీలు వచ్చే అవకాశం.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బిస్కెట్ తిన్న వెంటనే ఆరోగ్య సమస్యలు వస్తాయని కాదు కానీ, నిత్యం అలవాటుగా చేసుకుంటే దీర్ఘకాలికంగా గుండె, డయాబెటిస్, బరువు సమస్యల దారి తీస్తుంది. టీ తాగేటప్పుడు బిస్కెట్లు తినడం సౌకర్యంగా అనిపించవచ్చు కానీ అది ఆరోగ్యానికి మెల్లగా హాని చేస్తుంది. మైదా, పంచదార, ప్రిజర్వేటివ్‌లతో చేసిన సాధారణ బిస్కెట్ల బదులు హోమ్‌మెడ్, హెల్తీ, న్యూట్రిషస్ స్నాక్స్ తీసుకోవడమే ఉత్తమం.