Health time table that must be followed for good health
Health Time Table: ప్రస్తుతం కాలంలో మనుషులది ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. సరైన ఆహరం, సరైన విశ్రాంతి, సరైన నిద్ర, సరైన వ్యాయాయం శరీరానికి అందడంలేదు. కాబట్టి, మంచి ఆరోగ్యం కోసం జీవనశైలీలో మార్పు అవసరం(Health Time Table). వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమబద్ధమైన జీవనశైలి అవసరం. రోజు మొత్తంలో మనం ఏ సమయంలో ఏమి చేస్తున్నామన్న దానిపైనే మన ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది. ఈ టైం టేబుల్ సహజమైన జీవనశైలిని అలవరచుకోవడంలో తోడ్పడుతుంది. కాబట్టి, అలాంటి టైం టేబుల్స్ మన ఆరోగ్యాన్ని సరిచేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. మరి ఆ టైం టేబుల్ ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Colon Cancer: కోలన్ క్యాన్సర్ అంటే ఏమిటి.. ప్రమాద స్థాయి ఎంత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉదయం 5:00 AM నుంచి 7:00 AM ప్రభాతకాలం:
5:00 AM: ఈ సమయంలో నిద్ర లేవడం అనేది శరీరానికి అత్యంత శ్రేష్ఠమైన సమయం. దీనివల్ల శ్వాసక్రియ, మెదడు చైతన్యం పెరుగుతాయి.
5:15 AM నుంచి 5:45 AM వరకు: మైండుఫుల్ మేడిటేషన్ లేదా ప్రార్థన చేయాలి.
5:45 AM నుంచి 6:30 AM వరకు: హల్కా వ్యాయామం, యోగా, ప్రాణాయామం, జాగింగ్/ వాకింగ్ చేయాలి.
6:30 AM నుంచి 7:00 AM వరకు: పళ్ళు, ముఖం శుభ్రం చేసుకోవడం, స్నానం వంటివి పూర్తి చేసుకోవాలి.
ఉదయం 7:00 AM నుంచి 9:00 AM శక్తివంతమైన ఆరంభం:
7:00 AM నుంచి 7:30 AM వరకు: గోరువెచ్చని నీరు+నిమ్మరసం త్రాగాలి.
7:30 AM నుంచి 8:00 AM వరకు: ఆరోగ్యకరమైన అల్పాహారం పూర్తి చేయాలి. ఉదాహరణకు మిలెట్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, లేదా ఇడ్లీ/ఉప్మా/పెసరట్టు తినాలి.
8:00 AM నుంచి 9:00 AM వరకు: పనులకు వెళ్ళాలి.
9:00 AM నుంచి 12:00 PM ఉత్సాహ సమయం:
ఇది శరీరశక్తి అత్యధికంగా ఉండే సమయం. ఈ సమయంలో కష్టమైన పనులు పూర్తిచేయడం చేయాలి. మధ్యలో 11:00 AM సమయంలో పండు లేదా గ్రీన్ టీ లాంటివి తీసుకోవచ్చు.
12:30 PM నుంచి 1:30 PM వరకు: సరైన టైంలో మధ్యాహ్న భోజనం చేయాలి. రాగి బుట్టలు, బ్రౌన్ రైస్, కూరగాయలు, సాంబారు/పప్పు, ఎక్కువగా కూరగాయలు, తక్కువగా అన్నం తీసుకోవాలి. భోజనానంతరం 5 నుంచి 10 నిమిషాలు నడవాలి. తరువాత కాస్త విశ్రాంతి
2:00 PM నుంచి 5:00 PM వరకు: ఈ సమయంలో మెదడు మళ్లీ చురుకుదనం చూపుతుంది. ఇది మళ్ళీ పనులు చేసుకోవడానికి చక్కటి సమయం. మధ్యలో 1 గ్లాస్ మజ్జిగ/కమ్మటి నీరు/పండ్లరసం తీసుకోవాలి.
5:00 PM నుంచి 7:00 PM వరకు శరీరానికి మళ్ళీ ప్రాణవాయువు నింపే సమయం:
5:30 PM: సాయంత్రం వాకింగ్, లైటు వ్యాయామం, ఆటలు ఆడటం వంటివి చేయాలి.
6:30 PM: తేలికపాటి స్నాక్స్, తేనెతో గ్రీన్ టీ, ఉడికించిన శనగ, వేరుశెనగ మొదలైనవి తీసుకోవాలి.
7:00 PM నుంచి 9:00 PM: రాత్రి సమయం శాంతంగా ఉండే సమయం:
7:30 PM నుంచి 8:30 PM: సమయంలో తేలికపాటి రాత్రి భోజనం తీసుకోవాలి. చిక్కుడు కూర, గుమ్మడికాయ, సూప్స్, చిన్న ముద్ద అన్నం తినాలి. భోజనం తర్వాత మళ్లీ 10 నిమిషాల నడక చేయాలి.
10:00PM లోపల నిద్రకి సిద్ధం అవ్వాలి.
9:00 PM నుంచి 10:00 PM: నిద్రకు ముందు సమయం ఈ సమయంలో
ఈ టైం టేబుల్ పాటించడం వల్ల లాభాలు: