Health Tips: చిన్నపిల్లల్లో నిద్ర సమస్యలా.. ఇలా చేస్తే గురకపెట్టి నిద్రపోతారు.. ఒక్కసారి ట్రై చేయండి

మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం. ఎందుకు అంటే, శరీరానికి అవసరమైన విశ్రాంతి(Health Tips) నిద్రలోనే దొరుకుతుంది.

Health Tips: 5 ways to treat sleep problems in young children

Health Tips: మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం. ఎందుకు అంటే, శరీరానికి అవసరమైన విశ్రాంతి నిద్రలోనే దొరుకుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. అందులోనే, చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య తీవ్రం అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు(Health Tips) తమ పిల్లలు నిద్రపోవడం లేదని, రాత్రిపూట ఏడుస్తున్నారని విచారిస్తున్నారు. ఈ సమస్యలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లిదండ్రుల మనశ్శాంతిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, నిద్ర అనేది చిన్న పిల్లలకు చాలా అవసరం. మరి పిల్లలు ప్రశాంతంగా నిద్ర పోవడానికి అవసరమైన కొన్ని చిట్కాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Green Chilies v/s Chilli Powder: మిరపకాయలు v/s కారం: రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.. దీనిని మాత్రం అస్సలు తినకండి

1.స్థిరమైన నిద్రపోత సమయం:

పిల్లల శరీరం ఒక సర్కేడియన్ రిథం ప్రకారం పనిచేస్తుంది. స్థిరమైన నిద్ర సమయం లేకపోవడం వల్ల ఇది లోపిస్తుంది. అందుకే పిల్లలను ప్రతి రోజు ఒకే సమయానికి పడుకునేలా అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల కేవలం వారం రోజులకే శరీరం ఆ ప్రక్రియకు అలవాటు పడుతుంది. నిద్రకి ముందు చేతులు కడగడం, కథ చెప్పడం వంటివి చేయాలి. టీవీ/మొబైల్ స్క్రీన్లు నిద్రకి కనీసం 1 గంట ముందు దూరంగా ఉంచండి.

2.నిద్రకి అనుకూలమైన వాతావరణం:

పిల్లల గది మితమైన వెలుగు, చల్లదనంతో ఉండేలా చూసుకోవాలి. లేకపోతె నిద్ర సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి, గదిలో వెలుగు తక్కువగా ఉండాలి. చల్లటి గాలి, నిశ్శబ్దం, సురక్షితమైన మంచం ఉండాలి.

3.శరీరాన్ని శాంతింపజేసే అభ్యాసం:

పిల్లలు నిద్రకి ముందు ఉద్వేగంగా ఉంటే నిద్ర సరిగా పట్టదు. శాంతమయమైన పనులు చేయడం వల్ల వారి మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి, నిద్రకి ముందు తల్లిదండ్రులతో తేలికైన కథలు చెప్పడం, లేదా సరదాగా మాట్లాడటం వంటివి చేయడం మంచిది. నిశ్శబ్ద సంగీతం వినిపించడం శాంతిని కలిగిస్తుంది. కొందరికి ఓం మంత్రం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు మంచి ఫలితాన్ని అందిస్తాయి.

Cumin Water Benefits: కీళ్ల నొప్పుల ఖేల్ ఖతం.. ఈ రసం చేసే మాయాజాలం.. లేచి పరిగెడతారు చూడు

4.సమతుల్య భోజనం:

రాత్రిపూట తిన్న ఆహారం నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ చక్కెర లేదా మసాలాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలగవచ్చు. కాబట్టి, రాత్రి భోజనం నిద్రకి కనీసం 1.5 నుంచి 2 గంటల ముందే ముగించాలి. సున్నితమైన ఆహారం ఖీర్, మిలెట్ పొర్రిడ్జ్, వేడి పాలు వంటివి తీసుకోవడం మంచిది. క్యాఫైన్ ఉన్న పదార్థాలు కోకో, చాక్లెట్, టీ, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోకూడదు.

5.దినచర్యలో శారీరక చురుకుతనం:

పిల్లలు శారీరకంగా చురుకుగా ఉండకపోతే, శరీరం ఆ రోజంతా శక్తిని ఖర్చు చేయదు. దీంతో రాత్రిపూట నిద్ర రావడం కష్టమవుతుంది. కాబట్టి, పిల్లలు ఆటపాటలకు రోజు కనీసం 2 గంటలు సమయం ఇవ్వాలి. ఉదయం వెలుతురులో ఉండటం సహజ నిద్ర శక్తిని బలోపేతం చేస్తుంది.