Cumin Water Benefits: కీళ్ల నొప్పుల ఖేల్ ఖతం.. ఈ రసం చేసే మాయాజాలం.. లేచి పరిగెడతారు చూడు
Cumin Water Benefits: జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

Drinking cumin water reduces joint pain.
ఆరోగ్యం విషయంలో మన పూర్వీకుల నుంచి తరతరాలుగా వాడుతూ వచ్చిన ప్రాథమిక ఔషధ పదార్థాల్లో జీలకర్ర (Cumin Seeds) ఒకటి. సాధారణంగా వంటకాల్లో రుచికి, మసాలాలలో భాగంగా దీనిని వాడతారు. అయితే, కేవలం రుచికి వంటకాలలో మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయి జీలకర్రలో. ముఖ్యంగా కీళ్లనొప్పులు, జీర్ణ సమస్యలు, శరీర బలహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఇది సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది. మరి జీలకర్ర వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కీళ్లనొప్పులకు జీలకర్ర మేలు:
జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (anti-inflammatory) గుణాలు కీళ్లనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. కీళ్లలో నొప్పి కలగడానికి ప్రధాన కారణం ఇన్ఫ్లమేషన్. జీలకర్రలో ఉండే క్యుమినాల్డిహైడ్ అనే పదార్థం ఈ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దానిలో ఉండే సహజమైన వేడి లక్షణాల వలన ఆర్థ్రైటిస్ (arthritis) వంటివాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం ద్వారా వాపు తగ్గి, కీళ్ల నొప్పులు తగ్గిపోస్తాయి. టీస్పూన్ జీలకర్రను రాత్రి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని మరిగించి, కాస్త చల్లబడ్డాక వడగట్టి తాగాలి. ఈ రసాన్ని రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే, కీళ్లనొప్పుల నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చు.
శరీరానికి జీలకర్ర చేసే ఇతర లాభాలు:
1.జీర్ణశక్తి మెరుగవుతుంది
జీలకర్రలోని ఎంజైములు జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తాయి. అజీర్ణం, గ్యాస్, పొత్తికడుపు సమస్యల నుంచి ఉపశనం ఇస్తుంది.
2.ఇమ్యూనిటీ పెరుగుతుంది:
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూగా వచ్చే జలుబు, దగ్గు వచ్చే వారికి ఉపశమనం అందిస్తుంది.
3.రక్తహీనత నివారణ:
జీలకర్రలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత (అనిమియా)ను నయం చేస్తుంది.
4. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది:
జీలకర్రలోని డిటాక్సిఫైయింగ్ లక్షణాలు చర్మంలోని మలినాలను తొలగించి, ప్రకాశవంతమైన రంగును అందిస్తాయి.
5.బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
జీలకర్ర నీరు మెటబాలిజాన్ని వేగవంతం చేసి, కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది మంచి ఎంపిక.
జీలకర్ర కేవలం వంటకాల్లో రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా అమూల్యమైన ఔషధం. ముఖ్యంగా కీళ్లనొప్పులు బాధిస్తున్నవారు, నానబెట్టిన జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అలాగే, శరీరానికి వ్యాధినిరోధక శక్తిని, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.