Health Tips: గర్భిణీలలో కాల్షియం లోపమా.. శిశువుకు ప్రమాదం కావచ్చు.. జాగ్రత్త సుమీ

గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం(Health Tips), భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పైన నేరుగా ప్రభావం చూపుతుంది.

Health Tips: Health problems caused by calcium deficiency in pregnant women

Health Tips: గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పైన నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. శిశువు ఎముకలు, దంతాలు, గుండె, నరాల అభివృద్ధికి కాల్షియం చాలా అవసరం. తగినంత కాల్షియం తీసుకోకపోతే తల్లికీ, బిడ్డకీ వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు గర్భిణీలలో కాల్షియం లోపం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య సమస్యల(Health Tips) గురించి వివరంగా తెలుసుకుందాం.

Women Health: మహిళలకు ప్రత్యేకం.. అల్లం, పసుపు బోలెడన్ని లాభాలు.. రోజు ఇలా చేయండి చాలు

1.ఎముకల బలహీనత:
కాల్షియం తక్కువగా ఉండటంవల్ల తల్లి శరీరంలోని ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. ఇది తరువాత దశలో ఆస్టియోపోరోసిస్ (ఎముకలు సులభంగా విరిగే స్థితి)కి దారితీస్తుంది.

2.కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు:
గర్భిణీ స్త్రీలు రాత్రివేళ ఎక్కువగా కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అనుభవిస్తుంటారు. ఇది కాల్షియం లోపానికి ఒక ముఖ్యమైన లక్షణం. ఇది గర్భిణీకి రాత్రివేళ నిద్రలేమికి కూడా కారణమవుతుంది.

3.దంత సంబంధిత సమస్యలు:
శరీరానికి తగినంత కాల్షియం అందకపోతే తల్లి పళ్ళు దెబ్బతింటాయి. దీనివల్ల దంతాలలో నొప్పి, పళ్ళు పలచబడటం, విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

4.గుండె సంబంధిత సమస్యలు:
కాల్షియం అనేది శరీరంలోని కండరాల పనితీరు, గుండె మోషన్‌ను నియంత్రించడంలో భాగంగా ఉంటుంది. కాబట్టి దీని లోపం వలన గుండె దడ పడడం, గుండె స్పందనల్లో అసమానతలు ఏర్పడవచ్చు.

5.పిండంపై ప్రభావితం చేయడం:
శిశువు ఎముకలు, దంతాలు, కండరాల అభివృద్ధికి తల్లి నుండి తగినంత కాల్షియం అవసరం. తల్లి శరీరంలో లోపం ఉంటే శిశువు ఎదుగుదల మందగిస్తుంది, లేదా జన్మ సమయంలో బలహీనంగా పుడే అవకాశముంటుంది.

6.అధిక రక్తపోటు, ప్రీ-ఎక్లాంప్షియా ప్రమాదం:
కాల్షియం లోపం ఉన్న గర్భిణీల్లో రక్తపోటు నియంత్రణ లోపించి, ప్రీ-ఎక్లాంప్షియా అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది తల్లి, శిశువుల జీవితానికి ప్రమాదం కలిగించగలదు.

కాల్షియం అందించే ఆహారం:

  • పాల ఉత్పత్తులు, జొన్న, బాదం, బీరకాయ వంటి కూరగాయలు, మినుములు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
  • విటమిన్ D: ఇది కాల్షియం శోషణకు అవసరం. ఉదయపు సూర్యకాంతిలో కొన్ని నిమిషాలు గడపడం వల్ల దీనిని పొందవచ్చు.