పారాసిటమోల్ (Paracetamol) లేదా ఆసెటామినోఫెన్ (Acetaminophen).. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే నొప్పి నివారణ, జ్వరాన్ని తగ్గించే మందు. దాదాపు ప్రతీ ఇంట్లో ఉండే ఓ సాధారణ మందు. తరుచుగా వచ్చే తల నొప్పి, జ్వరం, శరీర నొప్పులు వంటి సందర్భాల్లో దీన్ని స్వల్ప మోతాదులో వాడటం చూస్తూనే ఉంటాం. అది కేసుల తక్కువ మోతాదులోనే. అయితే, ఈ మందును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. మరీ ముఖ్యంగా లివర్ పై ఈ మందు ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
Allu Ayaan Arha : తాతయ్యతో కలిసి వినాయక చవితి పూజ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..
ఎలా ప్రభావితం చేస్తుందంటే?
పారాసిటమోల్ మందు శరీరంలో జీర్ణమై, ప్రధానంగా లివర్ ద్వారా విడదీయబడుతుంది. సాధారణ మోతాదులో తీసుకుంటే ఇది సురక్షితమే కానీ, అధిక మోతాదులో తీసుకుంటే, శరీరంలో దాని రసాయనిక పదార్థం NAPQI (N-acetyl-p-benzoquinone imine) అనే విష పదార్థంగా మారుతుంది. దీనిని అధిక మోతాదులో NAPQI లివర్ కణాలను నాశనం చేసే ప్రమాదం ఉంది.
లివర్ ప్రమాదంలో ఉందని తెలిపే సంకేతాలు:
- అలసట
- నలతగా ఉండటం
- వాంతులు, మలబద్ధకం
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
- చర్మం సమస్యలు, జాండిస్
- చేతులు, కాళ్లలో వాపు
- తలనొప్పి, చికాకు
ప్రమాదకర మోతాదు:
సాధారణంగా పెద్దవారు రోజుకు 4 గ్రాములు కంటే ఎక్కువ తీసుకోవడం ప్రమాదకరం
ఒకేసారి 10 గ్రాములకంటే ఎక్కువ తీసుకుంటే లివర్ విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.
పిల్లలలో ఇది మరింత ప్రమాదకరం కావచ్చు
నివారణ చర్యలు:
డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి
అనుమానం వచ్చినపుడు డాక్టర్‌ను సంప్రదించాలి
రోజూ లేదా తరచుగా వాడటం నివారించాలి
పారాసిటమోల్ ఒక సురక్షితమైన మందు కానీ, దాన్ని అవగాహన లేకుండా, ఎక్కువగా వాడటం వల్ల లివర్ పాడవడం జరుగుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. కాబట్టి.. నొప్పి, జ్వరం ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి.