Health Tips: గుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిదేనా.. పెడితే ఏమవుతుంది?

గుడ్లు అనేవి మన రోజు వారి ఆహారంలో ప్రధాన పాత్ర పోషించే(Health Tips) పోషకాహార పదార్థం. చాలా మంది ప్రోటీన్ కోసం

Health Tips: Is it good to store eggs in the fridge?

Health Tips: గుడ్లు అనేవి మన రోజు వారి ఆహారంలో ప్రధాన పాత్ర పోషించే పోషకాహార పదార్థం. చాలా మంది ప్రోటీన్ కోసం రోజు గుడ్లను తినడం అలవాటుగమే మారిపోయింది. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే? గుడ్లను ఎలా నిల్వ చేయాలి(Health Tips) అనేది. ముఖ్యంగా, ఫ్రిడ్జ్‌లో గుడ్లు పెట్టాలా? బయట ఉంచాలా? అనే ప్రశ్న చాలామందిలో వచ్చే డౌట్. మరి గుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిదేనా? ఉంచితే ఏమవుతుంది? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Heart Health: గుండె ఆరోగ్యం కోసం శక్తివంతమైన ఫుడ్.. రోజు ఉదయం తింటే హార్ట్ ఎటాక్ నుంచి జాగ్రత్తపడవచ్చు

గుడ్ల నిర్మాణం, నిల్వ:
గుడ్ల మీద సున్నితమైన షెల్ ఉంటుంది. ఇది సూక్ష్మజీవులను లోపలికి పోనివ్వకుండా కాపాడుతుంది. ఈ పొర దెబ్బతింటే గుడ్లు త్వరగా పాడవుతాయి. అందువల్ల, గుడ్లను సురక్షితంగా నిల్వ చేయడం చాలా అవసరం.

గుడ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఏమవుతుంది:

బాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది:
గుడ్లలో సాల్మొనెల్లా అనే హానికరమైన బాక్టీరియా పెరగడం ద్వారా అది విషంగా మారే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతలు (0°C – 4°C) ఈ బ్యాక్టీరియా పెరుగుదలని నియంత్రిస్తాయి.

జీవిత కాలం పెరుగుతుంది:
గుడ్లు ఫ్రిడ్జ్‌లో ఉంచితే సుమారు 3 నుండి 5 వారాల వరకు తాజాగా ఉంటాయి. గదికి ఉష్ణోగ్రతలో ఉంచితే 7 నుండి 10 రోజుల్లోనే పాడైపోయే అవకాశం ఉంది.

వాసన, రుచి నిలిచిపోతుంది:
గుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల గుడ్ల రుచి, వాసన మారకుండా సురక్షితంగా ఉంటుంది.

గుడ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • గుడ్లను ఫ్రిడ్జ్ డోర్‌లో కాకుండా లోపల ఉంచడం ఉత్తమం.
  • డోర్ తెరిచినప్పుడల్లా ఉష్ణోగ్రత మారుతుంది కాబట్టి గుడ్లపై ప్రభావం పడుతుంది.
  • గుడ్లపై మురికి, మలమూత్రం ఉంటే వాటిని తొలగించి ఉంచాలి.

చిన్న సలహా:

  • గుడ్లు పాడయినాయో లేదో తెలుసుకోవాలంటే నీటిలో వేసి చూడండి:
  • తళతళలాడుతూ దిగువన ఉంటే తాజాగా ఉన్న గుడ్లని అర్థం
  • కొంచెం పైకి లేస్తే వాడదగ్గ స్థితిలో ఉన్నాయని
  • పూర్తిగా పైకి తేలితే పాడైనవని అర్థం