Health Tips: Is there a risk of BP from eating appams every day?
Health Tips: మన భారతీయ భోజన సంస్కృతిలో అప్పడాలు ఒక ముఖ్యమైన భాగం పోషిస్తాయి. రుచిగా ఉండటం వల్ల చాలా మంది ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ మంచి రుచిని అందించడంలో ఇది ప్రత్యేకం. అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే అప్పడాలు ఎక్కువగా తినడం(Health Tips) అనేది ఆరోగ్యానికి మంచిదేనా? ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? తాజాగా జరిగిన పరిశోధనల్లో అప్పడాలు తినడం వల్ల బీపీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ అంశం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Bad Breath: నోటి దుర్వాసనకు అద్భుతమైన చిట్కా.. జస్ట్ ఇలా చేస్తే చాలు
అప్పడాలు అంటే ఏమిటి?
అప్పడాలు అంటే బియ్యం /పప్పు పిండితో తయారుచేస్తారు. దీనిలో ఎక్కువగా ఉప్పు, సోడా, నూనె వాడి వేయించి ఈ వంటకాలు తయారుచేస్తారు.
అప్పడాలు ఎక్కువగా తినడం వల్ల బీపీ వస్తుందా:
అప్పడాలను తరచుగా, అధికంగా తినడం వల్ల హై బీపీ (High Blood Pressure) వచ్చే ప్రమాదం ఉంది.
దీనికి గల ప్రధాన కారణాలు:
1.అధిక సోడియం (ఉప్పు):
అప్పడాల్లో అధికంగా ఉప్పు ఉంటుంది. దీనివల్ల శరీరంలో సోడియం అధికమై రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల బీపీ వచ్చే ప్రమాదం ఉంది. WHO ప్రకారం, రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తినడం మంచిది కాదు. ఒక చిన్న అప్పడంలో సగటున 150 నుంచి 250 మిల్లీగ్రాం సోడియం ఉంటుంది. కాబట్టి రోజు 2 నుంచి 3 అప్పడాలు తింటేనే శరీరానికి అవసరమైన రోజువారీ ఉప్పు మోతాదు దాటిపోతుంది. ఇది ప్రమాదం కావచ్చు.
2.వేపిన నూనె:
అప్పడాలను ఎక్కువగా నూనెలో వేయించి తయారుచేస్తారు. దీని వల్ల ట్రాన్స్‌ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ శరీరంలో ఎక్కువగా చేరుతుంది. ఇవి రక్తనాళాలు కాఠిన్యానికి దారితీస్తాయి. ఇది బీపీకి కీలకమైన కారణంగా మారే అవకాశం ఉంది.
3.రసాయనాలు, ప్రిజర్వేటివ్స్:
మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ అప్పడాల్లో MSG, సోడా బైకార్బొనేట్, రంగులు వంటి రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇది కొంతమందిలో రక్తపోటును హఠాత్తుగా పెంచే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాపాయం కావచ్చు.
4.నీటి నిల్వలు:
అప్పడాల్లో ఉండే అధిక ఉప్పు వల్ల శరీరం లోపల నీరు నిలిచి పోతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు & పరిష్కారాలు: