Health Tips: 30 ఏళ్ళ తరువాత ఈ పదార్థాలు దూరంగా ఉండండి.. చాలా ప్రమాదం

ప్రస్తుత కాలంలో మానవ ఆయిష్యు చాలా వరకు తగ్గిపోయింది. (Health Tips)వంద నుండి అరవై, అరవై నుంచి ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గిపోయింది.

Health Tips: These foods should be avoided after 30 years

Health Tips: ప్రస్తుత కాలంలో మానవ ఆయిష్యు చాలా వరకు తగ్గిపోయింది. వంద నుండి అరవై, అరవై నుంచి ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి, మన ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇప్పుడు ముప్పై ఏళ్లకే(Health Tips) చాలా రకాల రోగాలు వస్తున్నాయి. శరీరంలో హార్మోన్ల మార్పులు, మటాబాలిజం నెమ్మదించడం, అవయవాల వయస్సు పెరగడం వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, కొన్ని రకాల ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం, లేదా పూర్తిగా దూరంగా పెట్టడం అవసరం. మరి ఆ ఆహర పదార్థాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Diabetes: షుగర్ పేషేంట్స్ జ్యూసులు తాగవచ్చా.. ఒకేవేళ తాగితే ఏమవుతుంది?

1.అధిక పరిమాణంలో చక్కెర:
చక్కర ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే, చర్మం వేగంగా ముడతలు పడుతుంది. గుండెకు హాని కలుగుతుంది. కాబట్టి, తీపి పదార్థాలు దూరంగా ఉండటం మంచిది.

2.ప్రాసెస్ చేసిన ఆహారాలు:
చిప్స్, బిస్కెట్లు, ఫ్రోజెన్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉంటుంది. అలాగే, కృత్రిమ రంగులు, రసాయనిక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, కాలేయం, పేగులపై ప్రభావం కలిగించవచ్చు.

3.వైట్ బ్రెడ్, మైదా పదార్థాలు:
వైట్ బ్రెడ్, మాగీ, పాస్టా, సమోసా వంటి పదార్థాలు మైదాతో తయారు చేస్తారు. ఇవి జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ని పెంచే ప్రమాదం ఉంది. మైదా పిండి బదులుగా గోధుమ రొట్టెలు, మిల్లెట్ ఫ్లవర్స్, జొన్న, సాగు, బాజ్రా వంటివి తీసుకోవడం మంచిది.

4.అధిక ఉప్పు:
30 ఏళ్ళ తరువాత ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరిగే ప్రమాదం ఉంది. గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఉప్పు బదులుగా హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ని పరిమితంగా వినియోగించాలి.

5. కారంగా, ఎర్రగా ఉండే ఆహారాల:
ఎక్కువగా కారం ఉండే ఆహారం తినాలి. అలాగే, ఎక్కువగా వేయించిన పదార్థాలు తినకూడదు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు రావచ్చు.
ఈ ఆహారం కాలేయంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి, కారం తక్కువగా తీసుకోవడం ఉత్తమం.