Diabetes: షుగర్ పేషేంట్స్ జ్యూసులు తాగవచ్చా.. ఒకేవేళ తాగితే ఏమవుతుంది?

ఈ మధ్యకాలంలో చాలా మంది షుగర్(Diabetes) వ్యాధి భారిన పడుతున్నారు. చిన్న చిన్న వయస్కులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.

Diabetes: షుగర్ పేషేంట్స్ జ్యూసులు తాగవచ్చా.. ఒకేవేళ తాగితే ఏమవుతుంది?

Can diabetics drink juices? What happens if they drink them?

Updated On : September 4, 2025 / 2:30 PM IST

Diabetes: ఈ మధ్యకాలంలో చాలా మంది షుగర్ వ్యాధి భారిన పడుతున్నారు. చిన్న చిన్న వయస్కులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, మధుమేహం (Diabetes) ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీపి పదార్థాల విషయంలో. అస్సలు చక్కర ఉన్న పదార్థాలు అస్సలు తినకూడదు. అయితే, చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే.. మధుమేహ సమస్య ఉన్నవారు జ్యూసులు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?” అని. మరి మధుమేహం ఉన్నవారు జ్యూస్ తాగవచ్చా? మరి తాగితే ఏమవుతుంది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Lotus Roots Health Benefits: తామర వేర్లతో గుండె సమస్యలకు చెక్.. రోజు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు

జ్యూస్ అంటే ఏమిటి?
జ్యూస్ అంటే పండ్ల రసం. నిజానికి పండ్ల రసం అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే, ఇది సహజంగా ఉంటే సరే, కానీ చాలా సార్లు మార్కెట్లో దొరికే ప్యాకెటెడ్ జ్యూస్‌లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలంటి జ్యూస్ లలో అధిక మోతాదులో చక్కెర, ప్రిజర్వేటివ్స్, తక్కువ ఫైబర్ ఉంటుంది.

షుగర్ పేషెంట్స్‌కు జ్యూస్ తాగడం వల్ల ఎందుకు ప్రమాదకరం:

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్:
జ్యూస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి, జ్యూస్ తాగడం వల్ల గ్లూకోజ్ బ్లడ్‌స్ట్రీమ్‌లోకి త్వరగా వస్తుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.

ఫైబర్ లేకపోవడం:
పండ్లను తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, వాటిని రసంగా మార్చి తీసుకుంటే ఫైబర్ పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి, ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ శరీరంలో వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.

చక్కెర అధికం:
పండ్లలో షుగర్ కంటెంట్ ఒక మోతాదులో ఉంటుంది. కానీ, జ్యూస్ లలో రుచి కోసం అధిక చక్కరను కలపడం జరుగుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు హానికరంగా మారే ప్రమాదం ఉంది.

తగిన విధంగా తాగవచ్చు:

అయితే, షుగర్ పేషేంట్స్ పూర్తిగా జ్యూస్ లను తాగకుండా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలతో జ్యూస్‌ను నియంత్రిత మోతాదులో తీసుకోవచ్చు:

గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్ల జ్యూస్:
బెర్రీలు (బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ), ఆమ్లా (ఉసిరికాయ), ద్రాక్ష (తక్కువ మోతాదులో), నారింజ (పల్ప్‌తో) వంటి పండ్ల జ్యూస్ తాగవచ్చు. అది కూడా తక్కువ మోతాదులో.

ఫ్రెష్ హోం-మేడ్ జ్యూస్:
ఎలాంటి చక్కెరలు లేకుండా ఇంట్లో తయారు చేసుకునే జ్యూస్‌లు మాత్రమే తీసుకోవాలి.

తక్కువ మోతాదులో మాత్రమే తాగాలి:
పండ్ల రసాలు తాగడం మంచిదే కానీ, ఒకరోజులో 100 మిల్లీ లీటర్లు మించకుండా తాగాలి.

జ్యూస్ లకు ప్రత్యామ్నాయాలు:

  • గ్రీన్ టీ / హెర్బల్ టీ
  • నీళ్ళలో నానబెట్టిన సబ్జా గింజలు
  • జీరో షుగర్ ఫ్రూట్ స్మూతీలు.