Healthy drinks that boost immunity in our body
Healthy Drinks: మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి శక్తివంతమైన రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) చాలా అవసరం. వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే శరీరాన్ని తగిన విధంగా బలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఆరోగ్యకరమైన తీసుకోవాలి. అలాగే కొన్ని రకాల పానీయాల వల్ల కూడా ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. అందులోను సహజసిద్ధమైన, ఇంట్లోనే తేలికగా తయారు చేసుకునే బూస్టర్ డ్రింక్స్ చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ డ్రింక్స్ లోని పౌష్టిక గుణాలు శరీరానికి సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచుతాయి. మరి అలాంటి 5 శక్తివంతమైన ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్(Healthy Drinks) గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.హల్దీ పాలు (గోల్డెన్ మిల్క్):
పాలు, టీస్పూన్ పసుపు, మిరియాల పొడి, తేనె కలియికతో ఈ డడ్రింక్ ను తయారుచేస్తారు. పసుపులోని కర్క్యుమిన్ రసాయనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
2.అద్రక-తులసి కషాయం:
అల్లం, తులసి ఆకులు, తేనె, నీరు వంటి పదార్థాలతో ఈ బూస్టర్ డ్రింక్ ను తయారుచేస్తారు. నీటిలో తులసి, అల్లం వేసి ఉడికించి, చివరగా తేనె కలిపి వేడిగా ఈ పానీయాన్ని తీసుకోవాలి. అల్లం, తులసి రెండింటిలోనూ యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి.
3.లెమన్-హనీ వాటర్:
వేడి నీరు, నిమ్మరసం, తేనె లతో ఈ డ్రింక్ తయారుచేస్తారు. నిమ్మలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎనర్జీ ఇవ్వడమే కాకుండా, శరీరంలోని టాక్సిన్లను బయటకు తీసేయడంలో సహాయపడుతుంది. తేనె సహజ రోగనిరోధక గుణాలను కలిగి ఉంటుంది.
4.క్యారెట్-బీట్‌రూట్ జ్యూస్:
క్యారెట్, బీట్‌రూట్, అల్లం, నిమ్మరసం, ఉప్పు కలిపి ఈ పానీయాన్ని తయారుచేస్తారు. ఈ జ్యూస్ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిలో రక్తాన్ని శుభ్రపరిచే గుణం ఉండటంతో పాటు శక్తిని కూడా ఇస్తుంది.
5.అమ్లఫల జ్యూస్:
ఆమ్లా జ్యూస్, వేడి నీరు, తేనె కలిపి ఈ జ్యూస్ ను తయారుచేస్తారు. ఆమ్లా అంటేనే విటమిన్ Cకి పవర్‌హౌస్ లాంటిది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.