High BP: రక్తపోటు వల్ల కంటి సమస్యలు.. చూపుకోల్పోయే ప్రమాదం.. నిపుణులు ఏమంటున్నారు

అధిక రక్తపోటు గుండెపై ప్రభావితం చూపిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది సైలెంట్ గా కళ్లకు కూడా హాని కలిగిస్తుంది.

Eye problems

సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనుషులు అనేకరకాల రోగాల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది బీపీ(రక్తపోటు). ఈ సమస్యతో బాధపడుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.28 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. దీని వల్ల గుండె సమస్యలు రావడంతో పాటు శరీర అవయవాలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. అంతే కాకుండా అధిక రక్తపోటు అనేది కంటిచూపుపై కూడా ప్రభావం చూపిస్తుందట. తాజాగా జరిగిన అధ్యాయనాల్లో ఈ విషయం వెల్లడయ్యింది.

అధిక రక్తపోటు గుండెపై ప్రభావితం చూపిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది సైలెంట్ గా కళ్లకు కూడా హాని కలిగిస్తుంది. దీనినే హైపర్​​టెన్సివ్ రెటినోపతి అంటారు. దీనివల్ల కంటిలోని రెటీనాలో ఉండే చిన్న రక్త నాళాలను దెబ్బతింటాయట. మెల్లిగా దృష్టి మసకబారడం లేదా దృష్టి లోపం వస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. రెటీనా దృశ్య సంకేతాలను మెదడుకు పంపడానికి రక్తంపై ఆధారపడుతుంది. హైబీపీ వల్ల రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి రెటీనా దెబ్బతింటుంది. దానివల్ల దృష్టి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.

చాలా మందిలో అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులకు కారణం అవుతుంది. కానీ, మెల్లిగా కళ్ళు, చెవులు లాంటి మిగతా అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే రక్తపోటు కంట్రోల్ లో ఉండటం చాలా అవసరం. హైపర్​టెన్సివ్ రెటినోపతిని నివారించడానికి, చికిత్స చేయడానికి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, బరువు అదుపులో ఉంచుకోవడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి వాటివల్ల అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.