కేరళలో మూడు కేసుల్లో కరోనావైరస్ పాజిటీవ్ గా వచ్చింది. చైనాలో 360 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న కరోనాను నియంత్రించేందుకు భారతదేశం యుద్దప్రాతిపదికనే పనిచేస్తోంది. కొత్తగా పాజిటీవ్ రిజల్ట్ వచ్చిన మూడో పేషెంట్ ను కంజన్ గాడ్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. కేరళ నుంచి మాత్రమేకాదు, మిజోరాంలో ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. జనవరిలో వీళ్లిద్దరు చైనా నుంచి తిరిగి వచ్చారు. వాళ్లను ఏకంత వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
బెంగుళూరులోనూ ఓ ఫ్యామిలీని నిరంతరం వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కుటుంబం ఇటీవలే చైనాకెళ్లి వచ్చింది. చుట్టుప్రక్కలవాళ్లు ఈ సంగతి చెప్పడంతో ఆర్యగశాఖ వాళ్లతో మాట్లాడింది. పరీక్షలు చేసింది. జనవరి 20-31 మధ్య 4,367 మంది బెంగుళూరువాసులు చైనాకెళ్లివచ్చారు. వీళ్లందరినీ స్క్రీనింగ్ చేశారు. పరిస్థితి ముదరడంతో ముందస్తు జాగ్రత్తగా ఫిబ్రవరి2వ తేదీన కేంద్రం… చైనా ప్రయాణీకులకు e-visaను తాత్కాలికంగా నిలిపేసింది. నిజానికి ఇప్పటికే ఆలస్యమైందన్న వాదనా ఉంది.
చైనా నుంచి భారతీయుల తరలింపు
వైరస్ లక్షణాలున్నవాళ్లను పర్యవేక్షణలో ఉంచారు. అదేసమయంలో చైనా నుంచి భారతీయులను రెండు విమానాల్లో రప్పించారు. ఆదివారం ల్యాండ్ అయిన రెండో విమానం మొత్తం 330 మంది భారతీయులను తీసుకొచ్చింది. ఇందులో మాల్దీవుల జాతీయులున్నారు. వీళ్లను సైనిక వైద్య కేంద్రంలో పర్యవేక్షణలో ఉంచారు. కరోనా వైరస్ బాధితుల కోసం ఆర్మీ.. ఢిల్లీకి సమీపంలోని మనేసర్ లో quarantine facility ఏర్పాటు చేసింది.
వైద్య నిపుణులు రెండువారాల పాటు చైనా నుంచి తిరిగివచ్చిన వాళ్లను పరీక్షిస్తారు. ఎలాంటి లక్షణాలు లేకపోతేనే ఇంటికి పంపుతారు. మిగిలిన వ్యాధులతో పోలిస్తే కరోనాలో అంత త్వరగా లక్షణాలు బైటపడవు. బైటకి ఆరోగ్యంగా కనిపిస్తారు. వీళ్లతో కలసి తిరిగిన వాళ్లకు కరోనా వ్యాపించే ప్రమాదముంది. అందుకే ఇంతక ముందు జాగ్రత్తలు. అదృష్టం కొద్దీ చైనా నుంచి వచ్చినవాళ్లలో ఇంతవరకు పాజిటీవ్ రిజల్ట్స్ రాలేదు.
Guess???? pic.twitter.com/w2ZA47s1lX
— Dhananjay kumar (@dhananjaypro) February 2, 2020
చైనా నుంచి తిరిగి వచ్చి ఆరుగురు విద్యార్ధులు డాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఎయిర్ ఇండియా అధికారప్రతినిధి షేర్ చేయడంతోనే దేశం హమ్మయ్య అనుకుంది. ఫిబ్రవరి 2 నాటికి 445 విమానాల్లో వచ్చిన 58,658 ప్రయాణీకులను కరోనా వైరస్ లక్షణాల కోసం స్క్రీన్ చేశారు. ఇందులో 142 మందిలో లక్షణాలను గమనించిన వైద్యులు Integrated Disease Surveillance Programmeలో భాగంగా వేర్వేరు ఏకంత వైద్యశాలలకు తరలించారు. మొత్తం 130 శాంపిల్స్‌లో 128మందికి నెగిటీవ్ వచ్చింది.