How long is it good to stay in the sun for vitamin D?
మానవ శరీరానికి ఇతర పోషక పదార్థాలతో పోలిస్తే విటమిన్ డీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది మన శరీరం సూర్యకాంతిని ఉపయోగించి విటమిన్ డీ ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే, ఈమధ్య కాలంలో చాలా మంది ఈ విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. దీనికి అనేకరణాలు ఉన్నాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి ఎండలో నిలబడితే సరిపోతుంది. ఈ విషయంలో చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే? ఎండలో ఏ సమయంలో నిలబడాలి? ఎంతసేపు నిలబడాలి అని. ఇఇక్కడ దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
విటమిన్ డీ ఎందుకు అవసరం:
విటమిన్ డీ శరీరంలో ఎముకల ఆరోగ్యం కోసం, ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండేందుకు, మూడ్, నిద్ర, హార్మోనల్ బలాన్సింగ్ కోసం అవసరం. చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్లలో ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం అవసరం అవుతుంది.
ఎండ ద్వారా విటమిన్ డీ ఎలా వస్తుంది?
మన చర్మం పై సూర్యకిరణాలు పడినప్పుడు, అందులో ఉండే UVB కిరణాల ద్వారా శరీరం విటమిన్ Dని తయారు చేస్తుంది. ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది.
ఏ సమయంలో ఎండలో నిలబడాలి?
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మంచి సమయం. ఈ సమయంలో UVB కిరణాలు తగిన మోతాదులో ఉంటాయి. ఎక్కువ వేడి లేకుండా తగిన మోతాదులో ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయం విటమిన్ డీ ఉత్పత్తికి మంచిదే అయినా ఎక్కువ వేడి వలన చర్మానికి హానికరం.
1.ఆహారంలో పొందగల పదార్థాలు:
2.వైద్య సలహాతో సప్లిమెంట్లు:
విటమిన్ డీ అంటే మెడిసిన్ కాదు సూర్యుడి నుంచి ఉచితంగా వచ్చే ఉచిత బహుపతి. దీనికి మనం ఇంట్లోనే పరిష్కారం కనుగొనవచ్చు. రోజు కొన్ని నిమిషాలు సూర్యకాంతిలో ఉండటం ద్వారా. సరైన సమయం, సరైన మోతాదులో ఎండ తీసుకుంటే, ఆరోగ్యకరమైన జీవితం మనకు దగ్గరవుతుంది.