Amla Ginger Juice
Amla Ginger Juice : ఏ మాత్రం పని ఒత్తిడి ఎక్కువైనా అలసట.. అలసట.. కరోనా తర్వాత చాలామంది నుంచి వస్తున్న కంప్లైంట్ ఇది. మరి శరీరానికి కావాల్సిన శక్తి అందాలంటే ఎలా? ఉసిరి, అల్లం, చియా గింజలు కలిపిన జ్యూస్ తాగితే శక్తి వస్తుందంటున్నారు డైటీషియన్ రిచా దోషి. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ రెసిపీ వైరల్ అవుతోంది.
Black Grapes : బరువును తగ్గించి రోగ నిరోధక శక్తి పెంచే నల్ల ద్రాక్ష
నార్మల్ సీజన్‌లో కన్నా వేసవి కాలంలో ఎండ వేడికి అలసట ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఉసిరి, అల్లం, చియా గింజలతో చేసిన పానీయం తీసుకోవడం చాలా మంచిది. ఉసిరిలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి అలసట లేకుండా చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయం చేస్తాయి. చియా గింజల్లో ఫైబర్, ప్రొటీన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి.
ఈ మూడింటితో జ్యూస్ ఎలా తయారో చేయాలో తెలిపే వీడియోను డైటీషియన్ రిచా దోషి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు.. ఇతర ఇన్ఫెక్షన్లు దూరం చేయడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపకరిస్తాయని ఆమె చెప్పారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ జ్యూస్ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఈ పండు తినండి..రోగ నిరోధక శక్తి పెంచుకోండి
రెండు ఉసిరిక కాయలు, 1 అంగుళం అల్లం, 1 స్పూన్ చియా గింజలు తీసుకోవాలి.. గోరు వెచ్చని నీటిలో వాటిని కడిగి చియా గింజలని నీటిలో నాన నివ్వాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి జ్యూసర్‌లో అల్లం కలిపి మెత్తగా రుబ్బాలి. వడబోసిన ఆ నీటిని గ్లాసులో వేసుకుని నానబెట్టిన చియా గింజల్ని కూడా అందులో కలిపి ఆ పానీయాన్ని తాగాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే రోజూ ఈ జ్యూస్ తాగమంటూ రిచా దోషి సలహా ఇస్తున్నారు.