ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సీన్ కనిపెట్టాల్సిన అత్యవసర పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ దేశాల సైంటిస్టులు కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకూ కరోనా మందును కనిపెట్టలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎంత కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా కరోనా వ్యాప్తి అదుపులో ఉండటం లేదు. చాప కిందనీరులా వ్యాపిస్తునే ఉంది. కరోనా వైరస్ Covid-19 డ్రగ్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాల్లో చైనా నుంచి అమెరికా, అస్ట్రేలియా, ఇజ్రాయెల్, జర్మనీ దేశాల్లో కొవిడ్-19 వైరస్ వ్యాక్సీన్ కనిపెట్టేందుకు పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి. కానీ, ఈ పరిశోధనల్లో పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించలేని పరిస్థితి నెలకొంది.
See Also | 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు కరోనా..ఇరాన్ లో అత్యధికంగా 255 మందికి
అణువులతో యాంటీవైరల్ డ్రగ్ :
ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా కరోనా వైరస్ కనిపెట్టేందుకు రంగంలోకి దిగింది. కొవిడ్-19 వైరస్ క్యూర్ చేసే వ్యాక్సీన్ కనిపెట్టేందుకు భారతదేశం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు.. ఎంతో ప్రాముఖ్యమైన డెవలప్ మెంట్ రాబోతోంది. హైదరాబాద్ ఆధారిత CSIR (ఇండియన్ ఇన్స్ స్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) కంపెనీ, పారాసిట్మల్ దిగ్గజం Cipla, IICT కంపెనీ సంయుక్తంగా కరోనా వైరస్ యాంటీవైరల్ డ్రగ్ కనిపెట్టబోతున్నాయి.
అంచనాల ప్రకారం.. వచ్చే 6-10 వారాల్లోగా భారత్ చేతిలో కరోనా వైరస్‌కు మందు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా యాంటీవైరల్ డ్రగ్స్ పై చాలా కంపెనీల పరిశోధించాయి. ఈ పరిశోధనల్లో యాంటీ వైరల్ కలిగిన అణువుల (మాలిక్యూలెస్)ను తయారు చేశాయి. కానీ, వీటికి డిమాండ్ లేకపోవడంతో ఆ అణువులను మార్కెట్లోకి ప్రవేశపెట్టలేకపోయాయి. ఏది ఏమైనా.. ఆ అణువులతోనే కరోనా వైరస్ మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ మూడు అణువుల సమ్మెళనంపై పరిశోధన :
CISR-IICT పరిశోధక ద్వయం.. remdesivir, favipiravir and baloxavir అనే మూడు యాంటీ వైరల్ అణువులపై పరిశోధన చేయాలని నిర్ణయించాయి. IICT డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్, ప్రిన్పిపల్ సైంటిస్ట్ ప్రథమ ఎస్ మానికర్ చెప్పిన ప్రకారం.. Favipiravir, Remiesivir, Bolaxivir ఈ మూడు సమ్మెళనాలతో మందు తయారు చేయాలని Cipla చైర్మన్ కోరినట్టు తెలిపారు.
కనిపెట్టబోయే వ్యాక్సీన్‌పై ట్రయల్స్ అనంతరం Cipla కంపెనీ డ్రగ్స్ ఆమోదం, ఉత్పత్తికి సంబంధించి అంశాలపై దృష్టి సారించనుంది. ‘Favipiravir, Remiesivir రెండు సమ్మెళనాలపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. 6-10 వారాల్లో డ్రగ్ తయారైపోతుంది. కానీ, ఇప్పుడు Bolaxavir సమ్మెళనం మాత్రమే ప్రారంభించనున్నాం’ అని చంద్రశేఖర్ వెల్లడించారు.
ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టొచ్చు :
CSIR-IICT ఇచ్చిన సూచనల ఆధారంగా Cipla ఈ ప్రక్రియను వేగవంతం చేయనుంది. కొత్త వైరస్ నిర్మూలన కోసం వ్యాక్సీన్ తయారు చేయాలంటే కనీసంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుందని ఇటీవలే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పేర్కొంది. అందులో ట్రయల్స్, అప్రూవల్స్ పూర్తయ్యే సరికి అదే సమయం పట్టొచ్చునని తెలిపింది.
మరోవైపు భారతీయ పరిశోధకులు 11 కరోనా వైరస్ జాతులను భద్రపరిచారు. వైరస్ సంబంధిత వ్యాధులపై పరిశోధన చేసేందుకు ఈ జాతి వైరస్ లను వినియోగిస్తుంటారు. నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పుణెలోని శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ను ప్రత్యేకమైన ప్రదేశంలో దాచిపెట్టారు. ఏది ఏమైనా.. కరోనా వైరస్ వ్యాక్సీన్ కనిపెట్టాలంటే ఒకవేళ క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేసినా ఇంకా 18 నెలల నుంచి 24 వరకు సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది.
అమెరికాలో 4 బాధితులకు కరోనా తొలి వ్యాక్సీన్ :
ఇదిలా ఉండగా, అమెరికాలో మొదటి Covid-19 వ్యాక్సీన్ తయారుచేయగా, వాషింగ్టన్ లోని సీటెల్ కైసర్ పర్మెంటే రీసెర్చ్ ఫెసిలిటీ దగ్గర నలుగురు కరోనా బాధితులకు ఎక్కించారు. ఈ వ్యాక్సీన్ కరోనా వైరస్ తో కూడినది కాదు.. హాని చేయని జెనటిక్ కోడ్ కు చెందినది.. వ్యాధికి కారణమయ్యే వైరస్ నుంచి కాపీ చేసిన ఈ కోడ్ ఆధారంగా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
దీనిపై నిపుణులు కూడా వ్యాక్సీన్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. ప్రపంచమంతా సైంటిస్టులు ఫాస్ట్ ట్రాకింగ్ రీసెర్చ్ చేస్తున్నారు. అందులో ఇది ఫస్ట్ హ్యుమన్ ట్రయల్ గా చెప్పవచ్చు.. నేషనల్ ఇన్సిస్టూట్స్ ఆఫ్ హెల్త్ ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది. ముందుగా జంతువుల వ్యాధి నిరోధక వ్యవస్థపై ఈ వ్యాక్సీన్ ప్రభావంతంగా పనిచేయగలదా అనేదానిపై కూడా పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు.
See Also | అనుష్క శర్మ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ చూశారా..